Site icon NTV Telugu

Bharat Jodo Yatra: తెలంగాణలో భారత్ జోడో యాత్ర ఎంట్రీ

Bharath Judo Yatra

Bharath Judo Yatra

ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. రాహుల్‌ గాంధీ చేస్తున్న భారత్‌ జోడో యాత్ర నేడు తెలంగాణ లోకి ప్రవేశించింది. రాయచూర్ యర్మరస్ నుండి మహబూబ్ నగర్ జిల్లా థాయ్ రోడ్ సర్కిల్ వరకు రాహుల్ యాత్ర సాగనుంది. ఇవాళ దాదాపు 13 కిలోమీటర్ల మేర సాగనున్న యాత్ర చేయనున్నారు. కృష్ణ నది ‌బ్రిడ్జి‌ మీద రాహుల్ గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్వాగతం పలకనున్నారు. భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించినప్పుడు రాహుల్ గాంధీకి జాతీయ పతాకాన్నిటీ కాంగ్రెస్‌ నేతలు అందించనున్నారు. కృష్ణా నది‌ బ్రిడ్జి‌నుండి తెలంగాణలో మూడు కిలోమీటర్ల మేర రాహుల్ యాత్ర సాగనుంది.

Exit mobile version