Shamshabad: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం భయానకంగా మారింది. దీంతో రాష్ట్రంలో కార్యకలాపాలన్నీ స్తంభించాయి. శంషాబాద్ విమానాశ్రయం పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఈరోజు వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్ ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు. శంషాబాద్ ఎయిర్ ఎయిర్ పోర్ట్ లో ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఖతార్ వెళ్లాల్సిన విమానం శంషాబాద్ లో ల్యాండింగ్ ఎందుకు చేస్తున్నారో అర్థంకాని గందరగోళ పరిస్థితి ప్రయాణికుల్లో నెలకొంది. దోహా నుండి నాగపూర్ వెళ్లాల్సిన కత్తర్ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు దారి మళ్లించడంతో 300 మంది ప్రయాణికుల మైండ్ బ్లాంక్ అయ్యింది. కాసేపు విమానం ఎందుకు మళ్లించారో అర్థంకానీ గందరగోళపరిస్థితి నెలకొంది.
అయితే ఎవరూ భయాందోళన పడాల్సిన పరిస్థితి లేదని నాగపూర్ లో వాతావరణం అనుకూలించకపోవడంతోనే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు దారి మళ్లిస్తున్నట్లు ఎయిర్ లైన్స్ సిబ్బంది ప్రకటించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానంలోని 300 మంది ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్ లో సేఫ్ గా ల్యాండింగ్ అయ్యారు. అయితే వారికి ఇబ్బంది కలగకుండా ఎయిర్ లైన్స్ సిబ్బంది చూసుకున్నారు. అయితే అందులో కొంతమంది ప్రయాణికులు మండిపడుతున్నారు. ముందుగానే చూసుకుని ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చిండేది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో దోహా నుంచి నాగ్‌పూర్‌కు వెళ్తోన్న విమానం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన విషయం తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్ శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసి ప్రయాణికులను సురక్షితంగా కిందకుదించారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
Koppula Harishwar Reddy: మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల మృతి.. సీఎం కేసీఆర్ సంతాపం