Site icon NTV Telugu

Aroori Ramesh: ఎమ్మెల్యే అరూరి రమేశ్ కు నిరసన సెగ..

Aroori Ramesh1

Aroori Ramesh1

Protest to MLA Aruri Ramesh: టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కు నిరసన సెగ ఎదురైంది. నిన్న వర్ధన్నపేట మండలం కట్ర్యాలలో పలు అభివృద్ధిపనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను ప్రజలు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేసేంత వరకు కదలనివ్వమని నిలదీసారు. ఎమ్మెల్యే మాట్లాడటానికి ప్రయత్నించినా ససేమిరా అన్నారు గ్రామస్తులు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావణం నెలకొంది. గ్రామంలో చాలా సమస్యలు వున్నా ఇప్పటి వరకు పరిస్కరించలేదని మండిపడ్డారు. మూడు రోజుల నుంచి ఊళ్లో నీళ్లు రావడం లేదని అన్నారు. పెన్షన్, డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేశాకే ఇక్కడి నుంచి కదలనిస్తామని ఎమ్మెల్యే చుట్టుముట్టారు. గ్రామంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని అన్నారు.

Read also: Premarital Affairs: పెళ్లికి ముందు సెక్స్ చేశారో ఇక అంతే.. ఆ దేశంలో భారీ జరిమానా, జైలు శిక్ష

కుమ్మరి గూడెం, కట్ర్యాల రోడ్డు దారుణంగా ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. పేరుమాండ్ల కుంట తూములు తీసేసి పల్లె ప్రకృతివనం ఎలా ఏర్పాటు చేస్తారని ప్రజలు నిలదీశారు. కట్ర్యాల గ్రామ సర్పంచ్ స్థానికంగా ఉండడం లేదని తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే ఎదుట వాపోయారు. ఓట్లేసి గెలిపించుకున్న తమరు ఏం చేశారో చెప్పాలని ఎమ్మెల్యేను అడిగించారు. గంటపాటు ఎమ్మెల్యేను కదలినీకుండా అడ్డుగా నిలబడ్డారు. దీంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే సర్పంచ్ వ్యవహార తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి అతి కష్టం మీద పోలీసుల సహాయంతో అక్కడి నుంచి వెళ్ళారు.
MLC Kavitha Live: సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ

Exit mobile version