Site icon NTV Telugu

13 మంది పోలీసు ఆఫీస‌ర్ల‌కు పీపీఎం, పీఎం మెడ‌ల్స్

దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రకటించింది. తెలంగాణకు రెండు ప్రెసిడెంట్ పోలీసు మెడ‌ల్స్, మ‌రో 11 మంది పోలీసుల‌కు పోలీసు మెడ‌ల్స్ లభించాయి.
విశిష్ట సేవ‌లందించినందుకు గానూ టీఎస్ఎస్‌పీ మూడో బెటాలియ‌న్(ఇబ్ర‌హీంప‌ట్నం) క‌మాండంట్ చాకో స‌న్నీకి, పోలీసు ట్రాన్స్‌పోర్టు ఆర్గ‌నైజేష‌న్ విభాగంలోని ఐజీపీ ఆఫీస్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ జి. శ్రీనివాస్ రాజుకు ప్రెసిడెంట్ పోలీసు మెడ‌ల్స్ ల‌భించాయి.

పోలీసు మెడ‌ల్స్ పొందింది వీరే..
1.షాహ‌న‌వాజ్ ఖాసీం (ఐజీపీ, డైరెక్ట‌ర్ ఆఫ్ మైనార్టీస్ వెల్ఫేర్‌)
2.సంక్రాంతి ర‌వికుమార్( అడిష‌న‌ల్ డిప్యూటీ క‌మిష‌న‌ర్, స్పెష‌ల్ బ్రాంచ్, సైబ‌రాబాద్‌)
3.పుల్ల శోభ‌న్ కుమార్ (ఏఎస్పీ, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి)
4.రాయ‌ప్ప‌గారి సుద‌ర్శ‌న్‌(ఏఎస్పీ ఇంటెలిజెన్స్, హైద‌రాబాద్‌)
5.పొల‌గాని శ్రీనివాస్ రావు(డీఎస్పీ, ఐజీపీ ఇంటెలిజెన్స్‌, సెక్యూరిటీ వింగ్‌)
6.గుడేటి శ్రీనివాసులు(డీఎస్పీ, అడిష‌న‌ల్ డీజీపీ టెక్నిక‌ల్ ఆఫీస్)
7.కేఎం కిర‌ణ్ కుమార్‌(డీఎస్పీ, వ‌న‌ప‌ర్తి స‌బ్ డివిజ‌న్)
8.మ‌హ్మ‌ద్ యాకుబ్ ఖాన్‌(ఆర్ఎస్ఐ, ఇంటెలిజెన్స్‌)
9.బెండి సత్యం (అసిస్టెంట్ ఆర్ఎస్ఐ, ఏడో బెటాలియ‌న్, డిచ్‌ప‌ల్లి)
10.మెట్టు వెంక‌ట‌ర‌మ‌ణా రెడ్డి(అసిస్టెంట్ ఆర్ఎస్ఐ, ఏడీజీపీ ఆఫీస్, ఆప‌రేష‌న్స్, గ్రేహౌండ్స్)
11.ఇల్పంద కోటేశ్వ‌ర్ రావు(హెడ్ కానిస్టేబుల్, ఎనిమిదో బెటాలియ‌న్, కొండాపూర్)

https://ntvtelugu.com/minister-ktr-criticized-the-central-government/
Exit mobile version