NTV Telugu Site icon

Ponnam Prabhakar: కుల వృత్తులను కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Ponnam Prabhakar: కుల వృత్తులను కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. సచివాలయంలో పొన్నం ప్రభాకర్ ను కుమ్మరుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నడికుడ జయంత రావు, కుమ్మర సంఘం రాష్ట్ర కమిటీ నేతలు కలిసారు. కులవృత్తుల్లొ కుమ్మరుల వృత్తి అంతరించిపోతున్న సందర్భంగా.. వృత్తిని కాపాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కి విజ్ఞప్తి చేసారు. 5 ఎకరాల్లో వృత్తి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేసి వృత్తిని కాపాడాలని కోరారు. యంత్రాల ద్వారా మట్టి పాత్రలు తయారు చేయడానికి ఉచిత విద్యత్ అందించాలని తెలిపారు. తయారు చేసిన మట్టి పాత్రలు అమ్ముకునుటకు ప్రభుత్వ స్థలాలో మార్కెట్ లలో షాపులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కుల వృత్తులను కాపాడడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. కుల వృత్తులను కాపాడడానికి తమ ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని కుమ్మర సంఘం నేతలకు తెలిపారు.

Read also: Shakib Al Hasan: ఎంపీగా గెలిచాడు.. అభిమాని చెంప చెల్లుమనిపించాడు! బంగ్లా కెప్టెన్‌ వీడియో వైరల్

కుల వృత్తులను కాపాడడానికి తమ ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని కుమ్మర సంఘం నేతలకు తెలిపారు. కాగా.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ పూజలు చేశారు. హుస్నాబాద్‌లో ఎమ్మెల్యేకు ప్రభుత్వం క్యాంపు కార్యాలయాన్ని కేటాయించింది. కుటుంబ సమేతంగా గోమాతకు పూజలు చేసిన అనంతరం కార్యాలయంలోని ఫైలుపై తొలి సంతకం చేశారు. అనంతరం కార్యకర్తలతో సమావేశమయ్యారు. నియోజక వర్గ ప్రజలకు కార్యకర్తలకు ఏది అవసరమో దానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
History Of Khichdi: ఖిచ్డీ చరిత్ర వేల సంవత్సరాల నాటిది.. ఆ చక్రవర్తి అదంటే పడిచచ్చేవాడట