NTV Telugu Site icon

Ponguleti: ఎగిరిపోయిన పక్షులన్నీ మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరుతున్నాయి.. పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

Ponguleti

Ponguleti

Ponguleti: కాంగ్రెస్ గూటి పక్షులన్ని కాంగ్రెస్ వైపు వస్తున్నాయని కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. పెను తుపాన్ లా కాంగ్రెస్ విజృంభిస్తుందన్నారు. ఆత్మ గౌరవం కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ నేతల మీద ఫోకస్ చేసి ఐటీ ఈడి దాడులు చేస్తున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పలితలను ఊహించి ఈ దాడులు చేస్తున్నాయని తెలిపారు. బీఆర్ఎస్, బీజీపీ లు కలసి ఈ దాడులు చేస్తున్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనడానికి ఇదే నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన బీజేపీకి నష్టం లేదన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావద్దు అదే బీజేపీ వైఖరి అన్నారు. నామీద కూడా కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ నేతల సూచనల మేరకు నామీద నాకుంటుంబానికి చెందిన వారి మీద, అనుచరుల మీద వ్యూహం పన్ను తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ లో చేరినప్పుడే ఈ దాడులు జరుగుతాయని నాకు తెలుసన్నారు. తెలిసినప్పటికీ కాంగ్రెస్ నే ఎన్నుకున్ననని తెలిపారు. కాంగ్రెస్ ను ప్రజలు కోరుకున్నారు అందువల్లనే కాంగ్రెస్ లో చేరానని అన్నారు. కాంగ్రెస్ కు దేశంలో మంచి అవకాశాలు వున్నాయన్నారు. తాత్కాలికంగా ఇబ్బందులు వున్న తప్పవన్నారు. ఎన్ని దాడులు చేసిన బెడిరేది లేదని తెలిపారు. కాళేశ్వరం రోల్ మోడల్ అని కేసీఆర్ పదే పదె చెప్పేదన్నారు. ప్రపంచంలో ఇదే గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పారు…

మరి ఇప్పుడు ఏమైంది? అని ప్రశ్నించారు. కాళేశ్వరంలో కేసీఆర్ ఎంత అవినీతికి పాల్పడింది ఇది రుజువు చేస్తుందన్నారు. మేడిగడ్డ అన్నారం ఏదో ఒక్క సమయంలో వాష్ ఔట్ అవుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్ లను యుద్ద ప్రాతిపదికన కులకొట్టి మళ్ళీ నిర్మించాల్సి వుందన్నారు. కూలిపోతే కొన్ని వందల వూర్లు నాశనం అవుతాయి.. మునిగి పోతాయన్నారు. బీజేపీకి ప్రశ్నలు.. కాళేశ్వరం డ్యామేజీకి బాధ్యులైన వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదు? ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అని ప్రశ్నించారు. చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందన్నారు. అక్రమంగా సంపాదించిన లక్షలాది కోట్లతో ఓట్లను కొనాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బుతో మూడో సారి అధికారంలోకి రావాలని కేసీఆర్ ప్లాన్ అంటూ ఆరోపించారు. నాకొడుకు పెళ్లికి వాల్ క్లాక్ ఇస్తే దానిని కూడా రాజకీయం చేయడం కేసీఆర్ కు తగదన్నారు. నేను సీఎంగా, మంత్రిగా పని చేయలేదన్నారు. మీ వల్ల నేను ఏ పదవి కూడా పొందలేదన్నారు. పోలీస్ అధికారులకు హెచ్చరించారు. పోలీస్ అధికారులు చెంచాలుగా నిచా తి నీచంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిఫలం అనుభవిస్తారన్నారు. మీ పరిధిలో రాజ్యాంగ బద్దంగా వ్యవహరించండని తెలిపారు.
Chittoor: పంట పొలంలో ఏనుగు మృతి.. కారణం ఇదేనా..?

Show comments