Police Special Drive : ఆ ఆటోలకు మాత్రమే అనుమతి..

హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. హైదరాబాద్​లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆటోలను కట్టడి చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నేపథయంలో నేటి నుంచి నగరంలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు. హైదరాబాద్​ పరిధిలో రిజిస్ట్రేషన్‌ జరిగిన ఆటోలకు మాత్రమే నగరంలో తిరిగేందుకు అనుమతించనున్నారు. అంతేకాకుండా రవాణా, పోలీసు శాఖ లు చూసీచూడనట్టు వదిలేయటంతో తెలంగాణ, ఏపీల నుంచి కొనుగోలు చేసిన ఆటోలను యథేచ్ఛగా నగరంలో ఆటో వాలాలూ నడుపుతున్నారు.

దీంతో పరోక్షంగా ట్రాఫిక్‌ రద్దీ, కాలుష్య తీవ్రతకు కారణమవుతోంది. వీటిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఇటీవల ట్రాఫిక్‌ పోలీసులు ఆటో డ్రైవర్లు, సంఘాలకు అవగాహన కల్పించారు. ప్రత్యేక తనిఖీల్లో ఆటోలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్స్, ఇన్సూరెన్స్, యూనిఫాం తప్పనిసరిగా ఉండాలని ఆటోడ్రైవర్లకు పోలీసులు సూచనలు చేశారు.