Site icon NTV Telugu

Two notices to Raja Singh: రెండు నోటీసులు.. ఇన్నిరోజులు పోలీసులు నిద్రపోతున్నారా? రాజాసింగ్ ఆగ్రహం

Two Notices To Raja Singh

Two Notices To Raja Singh

Two notices to Raja Singh: ఎమ్మెల్యే రాజా సింగ్ కు మరోసారి హైదరాబాద్ పోలీసుల నోటీసులు జారీ చేసింది. ఒక్కే రోజు రెండు పోలీస్ స్టేషన్ల నుంచి రాజా సింగ్ కు నోటీసులు ఇచ్చారు. 41 సీఆర్‌పీసీ కింద షాహీనాథ్ గుంజ్, మంగల్ హాట్ పోలీసులు నోటీసులు జారీ చేసారు. ఈనేపథ్యంలో.. రాజాసింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పై తెలంగాణ పోలీసులు కుట్ర పనుతున్నారు అంటూ ఆరోపించారు. ఫిబ్రవరి, ఏప్రిల్ లో నమోదైన కేసులపై ఇప్పుడు ఎందుకు నోటీసులు ఇస్తున్నారు అంటూ రాజా సింగ్ ప్రశ్నించారు. తనను అరెస్ట్ చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్నారని పోలీసులపై నిప్పులు చెరిగారు. ఇన్ని రోజులు తెలంగాణ పోలీసులు నిద్ర పోతున్నారా? అంటూ ప్రశ్నించారు.

అయితే.. 2022 ఏప్రిల్‌ 12న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. శ్రీరామనవని పురస్కరించుకొని నిర్వహించిన శోభాయాత్ర సందర్భంగా రాజా సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని షాహినాత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఈ ఏడాది ఫిబ్రవరి 20న పోలీసులు యూపీ ఎన్నికల విషయమై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈనేపథ్యంలో.. ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఓటేయకపోతే బుల్‌డోజర్లు వస్తాయంటూ.. యోగి ఆదిత్యనాథ్ కు ఓటేయకపోతే యూపీని వదిలి వెళ్లాల్సి వస్తోందని కూడా వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్‌ వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఈసీ రాజాసింగ్ ను వివరణ కోరింది. రాజాసింగ్‌ వ్యాఖ్యల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రాజాసింగ్ పై కేసు నమోదు చేయాలని కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాల మేరకు మంగళ్ హాట్ పోలీసులు రాజాసింగ్ పై కేసు నమోదు చేయడమేకాకుండా.. రాజాసింగ్‌పై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఈసీ.

అయితే.. మునవర్‌ హైదరాబాద్‌ లో అనుమతించకూడదని, ఒకవేళ అనుమతిస్తే.. పరిణామాలు తీవ్రతరం అవుతాయని రాజాసింగ్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ హైటెన్షన్‌ మధ్య మునవార్‌ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి నిర్వహించారు. దీనిపై రాజాసింగ్‌ మళ్లీ మహమ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓవీడియోను రిలీజ్‌ చేయడంతో.. భాగ్యనరగంలో ముస్లీములు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాజాసింగ్‌ ను 24 గంటల్లో అదుపులో తీసుకోవాలని డిమాండ్‌ చేసారు. దీంతో పోలీసులు రాజాసింగ్‌ ను అదుపులో తీసుకున్నారు. అయితే అరెస్ట్‌ అనంతరం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పై కోర్టు బెయిల్‌ ఇవ్వడంతో.. మళ్లీ ఆగ్రహావేశానికి లోనైన నిరసన కారులు ఓల్డ్‌ సిటీలో రోడ్లపైకి వచ్చి ఓ వర్గం యువత భారీగా చేరుకుని పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేయడంతో వారు లాఠీఛార్జ్ చేశారు. పలువురిని అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు ఓల్డ్ సిటీలో టెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతుంది.
Liger Movie Review :: లైగర్ రివ్యూ

Exit mobile version