Site icon NTV Telugu

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రోడ్లు కూడా మూత-సీపీ

న్యూ ఇయర్‌ సందర్భంగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.. అయితే, హైదరాబాద్‌లో మాత్రం ఇది కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్టు తెలుస్తోంది.. ఎక్కడికక్కడ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలతో పాటు.. కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు.. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు హైదరాబాద్‌లోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాజాగా మరో ప్రకటన విడుదల చేశారు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్ సీవీ ఆనంద్..

Read Also: వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ వద్దు.. లేదంటే రైతుల తరహాలో నేతన్నల ఉద్యమం..!

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు సీపీ సీవీ ఆనంద్.. నెక్లెస్ రోడ్ చుట్టూ ట్రాఫిక్ నిబంధనలు అమల్లోఉంటాయన్న ఆయన.. రేపు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ పై వాహన రాకపోకలు నిషేధించినట్టు పేర్కొన్నారు.. రేపు రాత్రి (డిసెంబర్‌ 31) నుంచి జనవరి 1న ఉదయం వరకు హైదరాబాద్‌లోని అన్ని ఫ్లై ఓవర్ల మూసివేస్తామని.. డ్రంక్ అండ్‌ డ్రైవ్ తనిఖీలతో పాటు.. అతి వేగంగా ప్రయాణించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చారు. ట్రిపుల్ రైడర్స్ పై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు సీపీ సీపీ ఆనంద్‌.

Exit mobile version