NTV Telugu Site icon

సిఎం కెసిఆర్ ను పొగిడిన ప్రధాని మోడీ

CM KCR Tests Positive for Covid-19

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సిఎం కెసిఆర్ కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా రాష్ట్రంలో ఆక్సీజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, బెడ్లు, ఇతర కరోనా సౌకర్యాల పరిస్థితి గురించి అధికారులను సీఎం కెసిఆర్ అడిగి తెలుసుకున్నారు. అయితే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌తో సీఎం కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణకు పలు సూచనలు చేశారు. సీఎం కేసిఆర్‌తో ఫోన్లో మాట్లాడిన హర్షవర్థన్ ప్రధానితో చర్చిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే సమీక్షా సమావేశానంతరం సీఎంకేసీఆర్ తో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్లో మాట్లాడారు. కేంద్ర మంత్రికి సీఎం చేసిన సూచనలను తనకు వివరించారని తెలిపారు. “మీది మంచి ఆలోచన, మీ సూచనలు చాలా బాగున్నాయి వాటిని తప్పకుండా ఆచరణలో పెడుతాం మీ సూచనలకు అభినందనలు” అంటూ ప్రధాని సీఎంను అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి మరింతగా ఆక్సీజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు సరఫరా చేయాలని, సీఎం చేసిన విజ్జప్తికి ప్రధాని సానుకూలంగా స్పందించారు. అందుకు సంబంధించి సత్వరమే చర్యలు చేపడతామని ప్రధాని సీఎంకు హామీ ఇచ్చారు.