కరీంనగర్ జిల్లా.. వీణవంక మండల కేంద్రములో దళిత బందు పథకం లబ్ధిదారుల ఎంపికలో అనహార్హులు ఉన్నారని గ్రామస్థుల ఆందోళన చేస్తున్నారు. వీణవంక మండల కేంద్రానికి 35 యూనిట్స్ మంజూరు అయ్యాయి. అందులో కేవలం టీఆర్ఎస్ వాళ్ల పేర్లే రాసుకున్నారని తహశిల్దార్ కార్యలయం ముందు అందోళన చేస్తున్నారు. మండలానికి మొత్తం 351యూనిట్స్ మొదటి విడతలొ వచ్చినట్లు రెవిన్యూ అదికారుల వెల్లడించారు. ప్రతి గ్రామంలో అసలైన లబ్ది దారుల ఎంపిక జరగలేదని వివిధ గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నెల 16న మండలంలో 26 గ్రామాల్లోని 351మంది లబ్ది దారులకు 10లక్షలు సీఎం చేతుల మీదుగా అందజేయనున్నారు.
దళిత బందు లబ్ధిదారుల ఎంపికలో అనహార్హులు.. ప్రజల ఆందోళన
