NTV Telugu Site icon

Revanth Reddy: కేసీఆర్ ను గద్దె దించండి.. రేవంత్‌ కు నామినేషన్ డబ్బులు ఇచ్చిన కొనాపూర్ వాసులు

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ ఎన్నికల అసలు ఘట్టం మొదలైంది. ఈరోజు నామినేషన్‌కు చివరి తేదీ. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణలో ప్రధాన పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యే ఉంది. బీఆర్‌ఎస్‌కు ముఖ్యమంత్రే స్టార్ క్యాంపెయినర్. కాంగ్రెస్‌కు చెందిన రేవంత్ సుడిగాలి పర్యటనలో దూసుకుపోతున్నారు. రేవంత్ తన ప్రసంగాల్లో బీఆర్‌ఎస్‌పై పదునైన డైలాగులతో పార్టీని ఉర్రూతలూగిస్తున్నారు. మంచి స్పందన రావడంతో పార్టీ మరింత ఉత్సాహంగా కనిపిస్తోంది. కాగా.. కొనాపూర్ లో రేవంత్ రెడ్డి పర్యటించారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కేసీఆర్ పూర్వీకుల గ్రామం కొనాపూర్ కు వెళ్లారు. అక్కడ రేవంత్ రెడ్డిని చూసిన కొనాపూర్ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. పదేళ్లుగా గుర్తురాని కొనాపూర్ ఇవాళ గుర్తొచ్చిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను గద్దె దించేందుకే రేవంత్ రెడ్డి కి గ్రామస్తులమంతా కలిసి నామినేషన్ డబ్బులు అందజేశారు. కాంగ్రెస్ గెలవాలని కోరారు. గ్రామస్తులకు రేవంత్ హామీ ఇచ్చారు. కేసీఆర్ ను తప్పకుండా గద్దె దించుతామన్నారు.

ఇవాళ కామారెడ్డిలో నేడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. రేవంత్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొనున్నారు. ఇక కామారెడ్డి జిల్లాలో నిర్వహించనున్న బీసీ డిక్లరేషన్ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తామని హామీలతో బీసీ డిక్లరేషన్ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఈ సభకు కాంగ్రెస్ ముఖ్యనేతలు హాజరు కానున్నట్లు సమాచారం. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ బహిరంగ సభలో పాల్గొని బీసీ డిక్లరేషన్ విడుదల చేయనున్నట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ వెల్లడించారు.
Virender Sehwag: పాకిస్తాన్ బై బై, సేఫ్ జర్నీ.. సెహ్వాగ్ సెటైర్లు!

Show comments