NTV Telugu Site icon

Peddapalli: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైళ్ల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్..

Peddapalli

Peddapalli

Peddapalli: పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పి 11 భోగీలు బోల్తా పడిన విషయం తెలిసిందే. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈనేపథ్యంలో రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు కూడా చేశారు. సుమారు 24 గంటలు శ్రమించి దెబ్బతిన్న ట్రాక్ లను సిద్దం చేశారు అధికారులు. పెద్దపల్లి జిల్లాలో రైళ్ల రాకపోకలకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రైల్వే ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన ప్రమాదంలో హుటా హుటిన ఘటనాస్థలానికి చేరుకుని 24 గంటల్లోపు దెబ్బతిన్న ట్రాక్ లను సిద్దం చేసిన అధికారులు. యుద్ద ప్రాతిపాదికన ట్రాక్ పునరుద్దరణ పనులు చేపట్టారు. అప్ లైన్, డౌన్ లైన్ ట్రాక్ లపై రైళ్ల పరుగులు పెట్టనున్నాయి.

ఉత్తర దక్షిణ భారత్ లను కలిపే ప్రధాన మార్గం కావడంతో పదుల సంఖ్యలో రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రెండు ట్రాక్ లు సిద్ధం కావడంతో రైళ్ల రాకపోకలు ప్రారంభం అయ్యాయి. మూడో లైన్ పునరుద్దరణ పనులు పూర్తి చేశారు. ట్రాక్ వేయడం,టెస్టింగ్ సైతం పూర్తి చేశారు. ట్రయల్ రన్ పెండింగ్ లో వుందని అది చేయగానే రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని తెలిపారు. ట్రయల్ రన్ అయ్యాక ట్రైన్ లను ఆ ట్రాక్ పైకి అధికారులు అనుమతించనున్నారని తెలిపారు. ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన రెండు ట్రాక్ ల ద్వారా యధావిధిగా రైళ్ళ రాకపోకలు కొనసాగుతున్నాయి. గూడ్స్ రైల్ ప్రమాదంపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. ఐదుగురు ఉన్నతాధికారులతో దక్షిణ మధ్య రైల్వే విచారణ కమిటీ వేసింది.
Eye Operation: ఎడమ కంటిలో సమస్య ఉంటే కుడి కంటికి ఆపరేషన్ చేసిన వైద్యులు.. చివరకి?