NTV Telugu Site icon

Peddapalli: చిల్లపల్లి గ్రామానికి అరుదైన గుర్తింపు..రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డు..

Peddapalli

Peddapalli

Peddapalli: పెద్దపల్లిజిల్లా చిల్లపల్లి గ్రామానికి అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ పంచాయతీ అవార్డులు 2024లో మహిళా మిత్ర పంచాయతీ విభాగంలో తెలంగాణ రాష్ట్రం నుంచి చిల్లపల్లి గ్రామం ఎంపిక అయింది. ఈ అవార్డు కింద గ్రామానికి 70 లక్షల బహుమతిని ఈనెల 11న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందిస్తారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ 9 అంశాలను పరిగణలోకి తీసుకొని దేశవ్యాప్తంగా 27 గ్రామపంచాయతీలకు దీన్ దయాల్ ఉపాధ్యాయి పంచాయతీ వికాస్ పురస్కారాలు ప్రకటించింది. ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో మంథని మండలం చల్లపల్లి గ్రామపంచాయతీకి రెండో ర్యాంకు లభించింది. దీనితో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామం అవార్డును గెలుచుకోవడంలో గ్రామానికి చెందిన మహిళల శ్రమ ఎంతో ఉందని చెప్పవచ్చు.

Read also: AUS vs IND :టెస్టులో భారత్‌ ఘోర పరాజయం.. టీమిండియా టాప్‌ ప్లేస్ లాక్కున్న ఆస్ట్రేలియా

మహిళలు గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోవడానికి ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసే సమావేశాలలో విధిగా అందరు పాల్గొంటూ.. వారి యొక్క సూచనలు సలహాలు తీసుకుంటూ.. సమిష్టి నిర్ణయాలు తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. అధికారులు ప్రతి సమావేశంలో అందరూ హాజరయ్యేలా చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తున్నారు. గ్రామంలో కొనుగోలు కేంద్రం కిరాణం కుట్టు మిషన్ సెంటర్ బ్యూటీ పార్లర్ మెడికల్ మొదలగు వ్యాపారాలలో మహిళలు రాణిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఈ గ్రామంలో 33 మహిళా సంఘాలు నిర్వహించబడుతున్నవి మహిళలు వీటిలో డబ్బును పొదుపు చేసుకుంటూ తమ అవసరాల నిమిత్తం లోన్లు తీసుకొని వ్యాపారాలు, వ్యవసాయం, డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసుకుంటూ వారి కాళ్ళపై నిలబడుతున్నారు.
Harisha Rao: ఖమ్మం వెళ్తే మాపై రాళ్ల దాడి చేయించారు.. హరీష్‌ రావ్‌ కీలక వ్యాఖ్యలు