Shocking : పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీలో జరుగుతున్న దుర్గ మాత నవరాత్రి ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అమ్మవారికి నైవేద్యం కోసం పాయసం తయారు చేస్తుండగా, బెల్లంలో నిషేధిత పొగాకు ప్యాకెట్ (అంబర్) బయటపడటంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో స్థానిక భవాని మాలధారణ భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి, ఆవేదనకు గురయ్యారు. అమ్మవారికి సమర్పించే పవిత్రమైన నైవేద్యంలో ఇలాంటి వస్తువు రావడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
IND vs BAN: టీమిండియాదే బ్యాటింగ్.. నాలుగు మార్పులతో బరిలోకి బంగ్లాదేశ్!
వివరాల్లోకి వెళ్తే, పాయసం తయారు చేయడానికి బెల్లం ప్యాకెట్‌ను ఓపెన్ చేయగా, అందులో అంబర్ ప్యాకెట్ కనిపించింది. దానిని విప్పి చూడగా నిషేధిత పొగాకు ఉండటంతో భక్తులు కంగుతిన్నారు. వెంటనే వారు సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. పండుగ వేళ ఇలాంటి సంఘటన జరగడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
