Btech Student: బీటెక్ స్టూడెంట్ రేణుశ్రీ ఆత్మహత్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. 6వ అంతస్తు నుంచి రేణుశ్రీ ఆత్మహత్య చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే.. బీటెక్ స్టూడెంట్ రేణుశ్రీ ఆత్మహత్య ఘటనపై పటాన్ చెరు డీఎస్పీ పురుషోత్తం రెడ్డి స్పందించారు. గీతం యూనివర్సిటీలో రేణుశ్రీ బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చదువుతుందని అన్నారు. మధ్యాహ్నం తర్వాత యూనివర్సిటీలోని క్యాంపస్ లో బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుందని అన్నారు. సంఘటనా స్థలంలోనే రేణు శ్రీ మృతి చెందిందని క్లారిటీ ఇచ్చారు. పోస్టుమార్టం పూర్తయింది కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని అప్పగించామన్నారు. ఇప్పటివరకు రేణు శ్రీ ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియ రాలేదన్నారు. రేణు శ్రీ ఫోన్ సిజ్ చేసి చివరిసారిగా ఎవరితో మాట్లాడిందో ఆరా తీస్తున్నామన్నారు. యూనివర్సిటీ నిర్లక్ష్యం కనబడితే వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Read also: Christian Oliver Dies: కరేబియన్ సముద్రంలో కూలిన విమానం.. హాలీవుడ్ నటుడు మృతి!
సంగారెడ్డి గీతం యూనివర్సిటీలో దారుణం జరిగింది. కాలేజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. యూనివర్సిటీలో చేరిన మూడు నెలలకే రేణుశ్రీ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అందరూ చూస్తుండగానే కాలేజీ బిల్డింగ్ ఐదో అంతస్తు పైకి ఎక్కింది. వెంటనే అక్కడి నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రేణుశ్రీగా గుర్తించారు. గీతం కాలేజీలో డేస్ కాలర్‌గా కాలేజీకి వెళుతున్నట్లు సమాచారం. పాటలో ఆమె బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు తెలుస్తోంది. మృతురాలు ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తెగా భావిస్తున్నారు. ఉదయం తనకు ఇష్టమైన చేపల కూర చేయమని తల్లిని కోరిందని తల్లి తెలిపింది. కాలేజీకి వెళ్తున్న నా కూతురు ఆత్మహత్య చేసుకుందని తెలిసి షాక్‌కు గురయ్యాను. అయితే ఆత్మహత్యకు ముందు రేణుశ్రీ ఫోన్ చేసిందని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. తల్లిదండ్రులకు ఫోన్ చేశారా లేక మరెవరికైనా ఫోన్ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదువుపై ఆసక్తి లేకపోవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా లేదా మరేదైనా కారణాలతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Bhatti Vikramarka: ఖమ్మంలో భట్టి విక్రమార్క రెండు రోజులు పర్యటన.. షెడ్యూల్ ఇదీ..