Site icon NTV Telugu

Betting Apps : ఇది ఆగదా.. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పోస్టల్ ఉద్యోగి బలి..

Dead

Dead

Betting Apps : ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం మరో కుటుంబాన్ని కూలదోసింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పోస్టల్ ఉద్యోగి అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మృతుడు నరేష్‌ (విజయనగరం జిల్లా బొబ్బిలి వాసి) భార్య, కూతురుతో వనస్థలిపురంలో నివసిస్తున్నాడు. కొన్నేళ్లుగా ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌లో మునిగిపోయిన నరేష్‌ భారీ మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టాడు. గెలుస్తాననే ఆశతో మరింతగా బెట్టింగ్ చేస్తూ చివరికి సుమారు రూ.15 లక్షల అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేకపోవడం, వ్యసనాన్ని మానలేకపోవడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

CM Revanth Reddy : బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు సాధించి తీరుతాం…

Exit mobile version