రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది.. తిరిగి తిరిగి కేసు విచారణ మొదటి వచ్చింది.. ఈడీ పట్టువదలకుండా ఇటు ప్రభుత్వం, ఎక్స్సైజ్ శాఖలపై పోరాటం చేస్తుంది.. తాము అడిగిన డిజిటల్ ఆధారాలు ఇవ్వడం లేదని కోర్ట్ ధిక్కరణ కింద పిటిషన్ వేయగా, ప్రభుత్వ అధికారులు దిగొచ్చి ఈడీ అధికారులు అడిగిన ఆధారాలని ఇచ్చినట్లు హైకోర్టులో మెమో దాఖలు చేశారు.. దీంతో ఒకటి రెండు రోజుల్లో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది..
టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఓ సంచలనమే అని చెప్పాలి.. నెలలు తరబడి రెండు విచారణ సంస్థలు విచారణ చేశాయి.. ఈ కేసులో ఏమి జరగబోతుందో అని రెండు తెలుగు రాష్ట్రాలు ప్రజలు ఎదురు చూశారు.. కానీ ఏమి ప్రయోజనం ఎటు తేల్చలేక ప్రముఖులకు క్లిన్ చిట్ ఇచ్చారు.. దీంతో ఈ కేసులో ప్రాముఖులను ప్రభుత్వం తప్పిస్తుందని, ఈడీ అధికారులను ప్రతివాదులుగా చేరుస్తూ, లోతైన దర్యాప్తు చేసి నిందితులను శిక్షించాలని పీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి పిటిషన్ వేశారు.. దీనిపై విచారణ చేసిన న్యాయ స్థానం ఈడీ అధికారులను కేసు విచారణ చేయాలని కోరగా, సుమోటాగా కేసు నమోదు చేసి విచారణ చేయడానికి తాము సిద్ధం అని తెలిపారు.. దీంతో ఎక్స్సైజ్ అధికారులు చేసిన ఇన్వెస్ట్ గేషన్ రిపోర్ట్స్, కేసు డైరీ మొత్తం ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రకారం తమకు కేవలం స్టేట్మెంట్ లు మాత్రమే ఇచ్చారు తప్ప, కీలక ఆధారాలు ఇవ్వలేదని, తమ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని స్వయంగా ఈడీ జాయింట్ డైరెక్టర్ హైకోర్టు కు ఫిర్యాదు చేశాడు.. దీంతో మరోసారి హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే ఈడీ అధికారులు అడిగిన డిజిటల్ ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్, ఫోరెన్సిక్ నివేదికలు, నిందితులు, సాక్షులు, విచారణ ఎదురుకొన్న ప్రముఖల స్టేటమెంట్లు ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం, అధికారులు ఇవ్వక పోతే మరోసారి కోర్ట్ ను ఆశ్రయించవచ్చునని తెలిపింది కోర్టు. అయితే ఈడీ అధికారులు అడిగిన డిజిటల్ ఆధారాలు కాకుండా నిందితులు, సాక్షులు, విచారణ ఎదురుకొన్న ప్రముఖల స్టేటమెంట్లు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. దీంతో ఈడీ అధికారులు ఆరోపణలు ఎదుర్కొన్న సినీ ప్రముఖులు ను విచారణకు పిలిచి విచారణ చేసిన కూడా ఎలాంటి పురోగతి లభించలేదు. ఓ దశలో కేసును క్లోజ్ చేయాలనే స్టేజ్ కూడా అధికారులు వెళ్లారు.
ఇక ఈ కేసులో పిటిషనర్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. తనతో ఉన్న కొన్ని ఆధారాలు ఈడీ అధికారులకు సమర్పించాడు. కేసులో ఎందుకు లోతైన దర్యాప్తు చేయాలేకపోయారని ఈడీ అధికారులను అడిగితే తమకు ప్రభుత్వం సహకారం ఇవ్వడం లేదని, డిజిటల్ ఎవిడెన్స్ ఇవ్వడం లేదని చెప్పారు. అయితే మీరు కోర్టు ధిక్కరణ కింద న్యాయ స్థానాన్ని ఆశ్రయించాలని లేకపోతే తానే స్వయంగా కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ వేస్తానని తెలపడంతో డ్రగ్స్ కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. తాజా ఈ కేసులో ప్రభుత్వ అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, తాము అడిగిన డిజిటల్ ఆధారాలు ఇవ్వకుండా తాస్కారం చేశారని ఈడీ ఆరోపించింది. ఆధారాలు కోసం ఆరు సార్లు లేఖలు రాసిన కూడా ప్రభుత్వం నుండి సరైన సమాధానం రాకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, ఎక్స్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ పై పిటిషన్ వేసింది ఈడీ. ఈడీ పట్టు వదలకుండా న్యాయ స్థానంలో పిటిషన్ వేయడంతో అధికారుల్లో చలనం వచ్చింది.
ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయడంతో ప్రభుత్వం దిగొచ్చింది. ఈడీ అడిగిన అన్ని వివరాలను అధికారులు ఇచ్చింది. డిజిటల్ రికార్డ్స్, కాల్ డేటా, ఎఫ్ఎస్ఎల్ నివేదికలను ఈడీకి అందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు రిజిస్టర్‌కు మెమో దాఖలు చేసింది. ప్రభుత్వం మెమోతో కోర్టు ధిక్కరణ పిటిషన్ ఈడీ వెనక్కి తీసుకుంది. ఇక మరోసారి టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ తారలను విచారించాలని ఈడీ భావిస్తుంది. తాజాగా అధికారుల చేతికి వచ్చిన ఆధారాలను విశ్లేషించి విచారణ చేయాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ ఇచ్చిన డిజిటల్ రీకార్డ్స్, కాల్ డేటా ఆధారంగా మరోసారి సినీ ప్రముఖుల డ్రగ్స్ లావాదేవీలు, డ్రగ్స్ కొనుగోళ్లు, మనీ లాండరింగ్ అంశాలపై కూపీ లాగునుంది.
