NTV Effect: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరి తీరం కంపు కొడుతుందని ఎన్టీవీలో ప్రసారమైన వార్తకు గ్రామపంచాయతీ అధికారులు స్పందించారు. వెంటనే గోదావరి తీరం వద్ద చర్యలు తీసుకుంటున్నారు. గోదావరి తీరంలో వ్యర్థాలు, భక్తుల దుస్తులు, అస్థికల కుండలతో దర్శనమిస్తూ దుర్గంధ వాసనతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎన్టీవీ లో వార్త ప్రసారం కావడంతో గ్రామపంచాయతీ అధికారులు దిగివచ్చి సిబ్బందితో వాటిని తొలిగిస్తున్నారు. దీంతో గోదావరి తీరం పరిశుభ్రంగా చేస్తుండడంతో భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read also: Karthika Masam: కార్తీక మాసం మొదటి సోమవారం.. శివనామ స్మరణతో మారుమోగిన ఆలయాలు..
కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరి తీరం వద్ద వ్యర్థాలు,భక్తుల దుస్తులు,కుండలతో దర్శనమిస్తూ దుర్గంధంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పవిత్ర కార్తీకమాసం ప్రారంభం కావడంతో కాళేశ్వరానికి తెలంగాణ, ఏపి, మహరాష్ట్ర చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచే కాకుండే ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అలాంటి గోదావరి వద్ద స్వామి ఆలయాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించెందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఆలయాన్ని దర్శించేముందు త్రివేణి సంగమమైన గోదావరి నదిలో పుణ్యస్నానాలు అచరించడం ఆనవాయితి. దీంతో పున్యస్నానాలకు వెళ్ళే భక్తులకు గోదావరి తీరంలో దుర్గంధం స్వాగతం పలుకుతుండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఎన్టీవీ ప్రచురించిన కథనంతో అధికారులు దిగివచ్చారు. వెంటనే గాదావరి తీరం మంతా దుర్గంధాన్ని ఉదయం నుంచే సిబ్బందితో తొలగించే పనిలో పడ్డారు. ఇది చూసిన భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. భక్తుల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం వెంటనే స్పందించినందుకు ఆనందం వ్యక్తం చేశారు.
Telangana TET Notification: నేడు టెట్ నోటిఫికేషన్… జాబ్ కేలండర్ ప్రకారం నిర్వహణ..