NTV Telugu Site icon

Nizamabad: షాకింగ్‌.. హోటల్ లో 122 కిలోల కుళ్లిన చికెన్ కు రంగులు కలిపిన విక్రయాలు..

Nizamabad Crime

Nizamabad Crime

Nizamabad: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నా హోటళ్ల యాజమాన్యాలు మాత్రం వెనక్కి తగ్గడంలేదు. కుళ్లిపోయిన మాంసం, కూరగాలతో వంటకాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దీనిపై సీరియస్ అయిన ఫుడ్ సేప్టీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్లపై రైడ్స్ చేస్తున్నారు. కుళ్లిన కూరగాయలు, మాంసం వుంటే హోటళ్లనే సీజ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లా కేద్రంలో చోటెచేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ లో 122 కిలోల కుళ్లిన చికెన్ కు రంగులు కలిపిన విక్రయాలు జరుగుతున్నాయని సమాచారంతో రావడంతో అధికారులు దాడులు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని లాహరి, వంశీ ఇంటర్నేషనల్ హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాలతో స్టార్ హోటల్స్, ప్రముఖ హోటల్స్ , రెస్టారెంట్లో దాడులు చేశారు. లహరి హోటల్ లో 122 కిలోల కుళ్లిన మాంసం ఉత్పత్తులు, ప్రమాదకరమైన రంగులు కలిపిన చికెన్ ను గుర్తించారు. బూజు పట్టిన కూరగాయలు, ఫంగస్ అన్న మిర్చి మసాల పెస్ట్ ల నిల్వల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశి హోటల్ లో 24 వేల విలువ చేసే హానికరమైన రంగుల తో కూడిన మాంసపు ఉత్పత్తులు గుర్తించారు. రెండు ఇంటర్ నేషనల్ హోటల్స్ కు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ప్రజారోగ్యంతో చెలగాటం అడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి తప్పులు పునరావృతం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. హోటల్ సీజ్ చేస్తామని అధికారులు అన్నారు.
Health Benefits: తిప్పతీగ ఆకు తింటే తిప్పలన్నీ మాయం..