NTV Telugu Site icon

Trap with Police DP: డ్రగ్స్ తో మీ పిల్లలు పట్టుబడ్డారు.. పోలీసుల డిపీతో తల్లి దండ్రులకు ట్రాప్‌..

Nizamabad Police Commissioner Kalmeshwar

Nizamabad Police Commissioner Kalmeshwar

Trap with Police DP: నిజామాబాద్ జిల్లాలో పోలీసుల పేరుతో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల డీపీ వాడుకుని అమాయకులకు కాల్స్ చేస్తే బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఉపాధి కోసం బయట దేశాలకు వెళ్ళిన గల్ఫ్ కుటుంబాలు, పై చదువులకు ఇతర ప్రాంతాలకు వెళ్ళిన కుటుంబాలే లక్ష్యంగా టార్గెట్‌ చేస్తూ సైబర్ కేటుగాళ్లు ఈ దారుణానికి పాల్పడుతున్నారు. గంజాయి, డ్రగ్స్ కేసుల్లో మీ పిల్లలు పట్టుబడ్డారని తల్లి దండ్రులకు ఫోన్లు చేసి ట్రాప్‌ చేస్తున్నారు. మీ పిల్లలను విడిచి పెట్టాలంటే డబ్బులు పంపాలని డిమాండ్ చేస్తూ బెదిరించారు. దీంతో ఇది నిజమని నమ్మిన 10 మందికి లక్షల్లో కాజేశారు. తరువాత పిల్లల వద్ద నుంచి ఫోన్‌ రావడంతో అసలు బండారం బయట పడింది. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read also: Virl Video: విమానాశ్రయంలో మహిళ బట్టలు విప్పి వీరంగం..వీడియో వైరల్

జిల్లాలో పోలీసుల ఫోన్ కాల్ బెదిరింపులు పెరగడంతో నిజామాబాద్‌ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ స్పందించారు. ఫేక్‌ కాల్స్‌ పై మాట్లాడుతూ.. పోలీసుల పేరుతో ఫోన్ వస్తే స్పందించవద్దని సూచించారు. ఐదు రోజులుగా పోలీసుల పేరుతో ఫేక్ కాల్స్ వస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. పలు కేసులు నమోదు చేశామన్నారు. అపరిచిత వ్యక్తుల ఫోన్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసుల పేరుతో ఫోన్ చేసి బెదిరిస్తే.. స్పందించవద్దు, స్దానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సీపీ, ఐజీ స్దాయిలో అధికారులు, నేరుగా ప్రజలకు కాల్స్ చేయరు, ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. 12 నంబర్స్ తో పోన్ కాల్స్ వస్తే స్పందించవద్దు , డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయవద్దని తెలిపారు. సైబర్ నేరగాళ్ల హాట్ స్పాట్లను సైబర్ సెక్యూరిటీ వింగ్ గుర్తించిందన్నారు. ఈ మధ్యలో తెలుగు వారితో కాల్స్ చేస్తూ.. మోసం చేస్తున్నారని తెలిపారు. సైబర్ నేరగాళ్లకు మాన ద్వారనే సమాచారం వెళ్తుందన్నారు. అవసరం లేని చోట్ల మన వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దని అధికారులు బాధితులకు సూచించారు.
Mallu Bhatti Vikramarka: నేడు ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన..