NTV Telugu Site icon

MP Dharmapuri Arvind: మంత్రి కోమటిరెడ్డి నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు..

Mp Dharmapuri Arvind

Mp Dharmapuri Arvind

MP Dharmapuri Arvind: మంత్రి కోమటిరెడ్డి నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఫైర్ అయ్యారు. కోమటిరెడ్డి అధికారులను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కోమటిరెడ్డితో మాట్లాడటానికి ఫోన్ చేసిన లిఫ్ట్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నిజామాబాద్ లోక్ సభ పరిధిలో 7 చోట్ల బ్రిడ్జిల నిర్మాణం చేపట్టామన్నారు. నా వల్లే జిల్లాలో కాంగ్రెస్ వీక్ అయ్యిందన్నారు. రూ.93 కోట్లతో చేపట్టిన మాధవనగర్ ఆర్వోబి.. 2 లైన్ ను 4 లైన్ చేశా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు బిల్లులు సకాలంలో ఇవ్వడం లేదన్నారు. రైల్వే రంగాన్ని కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు డిపాజిట్ చేసినా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు. మంత్రి కోమటిరెడ్డి అధికారులను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదన్నారు. జిల్లాకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎందుకు ఇవ్వలేదన్నారు. కేసీఆర్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మహేష్ గౌడ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కౌన్సిలర్ కూడా గెలవలేని వారు నా గురించి మాట్లాడతారా? అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఆలయాలకు రక్షణ కరువైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కి ఓటేసిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు వేయడం లేదన్నారు. జి.హెచ్.ఎం.సి లో 48 సీట్లు గెలిచిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు ఎందుకు గెలవలేదు.? అని ప్రశ్నించారు. లోకసభ ఎన్నికల్లో బిజెపికి ఓటేసిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు వేయడం లేదు..? అని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం వస్తుందనుకున్న సమయంలో 8 సీట్లకు ఎందుకు పరిమితం అయ్యం? అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కు ప్రజలు ఎందుకు ఓటేయడం లేదు..? బాధ్యులు ఎవరు. ? అని ప్రశ్నించారు. ఈ అంశాల పై బీజేపీ ఆలోచన చేయాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే..ఎవరిని చెప్పు కింద తొక్కి పెట్టాలో మాకు తెలుసన్నారు.

Telangana: గురుకుల పాఠశాలలకు తాళాలు.. బయటే టీచర్లు, విద్యార్దుల నిరీక్షణ..

Show comments