Site icon NTV Telugu

Baby For Sale : ఐదో సంతానంలో ఆడ పిల్ల.. 2 లక్షలకు బేరం పెట్టిన తల్లి

Baby

Baby

Baby For Sale : నిజామాబాద్‌ నగరంలోని మిర్చి కాంపౌండ్‌లో ఓ ఆడ శిశువు విక్రయించే ఘటన కలకలం రేపుతోంది. ఐదో సంతానంగా ఆడబిడ్డ పుట్టిందని, తాము పోషించలేమని తల్లిదండ్రులే అమ్మేశారు. రెండు లక్షల రూపాయలకు మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన వ్యక్తికి అమ్మినట్టు తెలుస్తోంది. ముత్యాలమ్మ, వెంకట్రావు అనే దంపతులు ఇప్పటికే నలుగురు పిల్లల తల్లిదండ్రులు. ఐదవ సంతానంగా పుట్టిన ఆడపిల్లను స్థానికుల అనుమానంతో చైల్డ్‌లైన్‌కి ఫిర్యాదు చేశారు. దాంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.

My Baby : ‘మై బేబీ’ సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ లాక్

ఈ ఘటనపై మొత్తం ఐదుగురిపై కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అమ్ముడైన శిశువును అధికారులు తిరిగి రికవర్ చేసి సంరక్షణ గృహానికి తరలించారు. శిశువు ఆరోగ్యం బాగానే ఉందని సమాచారం. ఆడపిల్లలను పోషించలేమనే భావన, సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leopards in Balapur: హైదరాబాద్‌లో చిరుతల కలకలం.. బాలాపూర్‌లో రెండు చిరుతలు..

Exit mobile version