NTV Telugu Site icon

Basara Temple: బాసరలో దసరా నవరాత్రుల ఉత్సవాలు.. పలు సేవలు రద్దు..

Basra

Basra

Basara Temple: నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ ఆలయం దేశంలోని ప్రసిద్ధ సరస్వతీ దేవాలయాలలో ఒకటి. ఇక్కడి సరస్వతీ ఆలయంలో అక్షరాభ్యాసానికి భక్తులు బాలబాలికలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడి త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కావడం విశేషం. అయితే.. బాసరలో శారదీయ శరన్నరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. వచ్చే నెల 03.10.2024 నుండి 12.10.2024 వరకు ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. కాగా.. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు తొమ్మిది రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వడం ఆనవాయితీ. మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజు బ్రహ్మచారిణి, మూడవ రోజు చంద్రగంట, నాల్గవ రోజు కూష్మాండ అవతారం, ఐదవ రోజు స్కందమాత, ఆరవ రోజు కాత్యాయని అవతారం, ఏడవ రోజు కాళరాత్రి అలంకారం, ఎనిమిదో రోజు మహా గౌరీ, తొమ్మిదో రోజు సిద్ధ ధాత్రి అలంకారం భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ తొమ్మిది రోజులూ ఆలయ అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లకు ఒక్కో నైవేద్యాన్ని సమర్పించారు. ఈ నేపథ్యంలో అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా.. పలు సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈ.ఓ వెల్లడించారు.

Read also: Pakistan: నస్రల్లా మృతిపై పాకిస్థాన్‌లో నిరసన.. హింసాత్మకంగా మారిన ఆందోళనలు

రద్దు చేసిన సేవలు ఇవే..

* అక్టోబర్ 3 నుంచి 11 వరకు అభిషేకాలు రద్దు.
* అక్టోబర్ 9న అక్షరాభ్యాసం తప్ప మిగతా ఆర్జిత సేవలు రద్దు.
* అక్టోబర్ 11 నుంచి 13 భక్తులు నిర్వహించే చండీహోమం రద్దు.
* అక్టోబర్ 9 వ తేదీన వి ఐ పీ పాస్ లు రద్దు.
* అక్టోబర్ 12న ఉదయం 10 గం.ల వరకు అక్షరాభ్యాసములు రద్దు

భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. భక్తులు వీటిని గమనించాలని, అమ్మవారి సేవలో పాల్గొన్నాలని సూచించారు. అమ్మవారికి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
MalliKarjuna Kharge: మోడీని గద్దె దింపే వరకు చనిపోను.. ఖర్గే కీలక వ్యాఖ్యలు