NTV Telugu Site icon

Basara Dasara: ముస్తాబైన ‘బాసర’.. నేడు శైలపుత్రి అలంకరణలో అమ్మవారు

Basara

Basara

Basara Dasara: నిర్మల్ జిల్లా బాసరలో నేటి నుంచి శారదీయ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ సరస్వతీ అమ్మవారి క్షేత్రంలో వేకువ జామున ఆలయ అర్చకులు శ్రీ జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి అమ్మవార్లకు మహాభిషేకం, అలంకరణ, మంగళహారతి, మంత్రపుష్పం తదితర పూజలతో మంగళ వైద్యసేవ, గణపతి పూజ, సుప్రభాత సేవలు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. అనంతరం ఉదయం 9 గంటలకు విఘ్నేశ్వర పూజ, క్షేత్రపూజ, స్వస్తి పుణ్యహ వచనము అంకురార్పణ, కలశస్థాపన (చర్చి ప్రతిష్ఠాపన) పూజలు ప్రారంభిస్తారు.

Read also: Konda Surekha: సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ

ఈరోజు అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. కట్టె పొంగలి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. భక్తులతో పాటు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బాసరలో బుధవారం జరిగే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పరిశీలించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, తాగునీటి సౌకర్యం, ఉచిత భోజన, వసతి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పండుగను విజయవంతం చేసేందుకు కృషిచేయాలన్నారు.
T20 World Cup 2024: నేటి నుంచే టీ20 ప్రపంచకప్‌.. తొలి పోరులో బంగ్లాదేశ్‌తో స్కాట్లాండ్‌ ఢీ!

Show comments