Site icon NTV Telugu

ఉద్యోగుల కట్టడిలో నీలోఫర్‌ అధికారుల వైఫల్యం..?

ఇటీవలే ఓ దుర్మార్గుడు రూ.100 కోసం బాలుడి ప్రాణాలను గాలిలో కలిపేసిన ఘటన నిలోఫర్‌ ఆసుప్రతిలో చోటు చేసుకుంది. అయితే నిలోఫర్ లో బాలుడి మరణం పై ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆలస్యంగా స్పందించారు. ఘటన పై సీనియర్ డాక్టర్ల తో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. అనుమానితుడిని చర్యలు తీసుకున్నామని సూపరింటెండెంట్ వెల్లడిస్తున్నారు.

ఘటనకు బాధ్యుడైన వ్యక్తి పేరును బయటపెట్టకపోవడంతో నీలోఫర్ అడ్మినిస్ట్రేషన్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కింది స్థాయి సిబ్బందితో నిలోఫర్ వైద్య అధికారులు సరిగ్గా పని చేయించ లేకపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రిలోకి పేషంట్ వచ్చినా, వెళ్లినా డెలివరీ అయినా, లంచం ఇవ్వాల్సిందేనని ఆసుపత్రికి వచ్చిన చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. 4వ తరగతి, కాంట్రాక్ట్ ఉద్యోగులను కట్టడి చేయడంలో అధికారులు విఫలం అవుతున్నారని అంటున్నారు.

Exit mobile version