Miyapur Firing: హైదరాబాద్ లో సందర్షిని ఎలైట్ రెస్టారెంట్ జనరల్ మేనేజర్ దేవేందర్ పై కాల్పుల ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అయితే.. కక్షతోనే దేవేందర్ పై రితీష్ కాల్పులు జరిపినట్లు అంగీరించాడు. సందర్షిని ఎలైట్ లో దేవందర్ తో పాటు రితీష్ నాయర్ మేనేజర్ గా పనిచేసేవాడు. కాగా.. రితీష్ నాయర్ కేరళ కు చెందిన వాసి. నెల రోజుల క్రితం అమ్మాయి విషయంలో రితీష్ కు దేవేందర్ కు మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి చిలికి చిలికి గాలివానయ్యాయి. గొడవలో దేవేందర్ పై రితీష్ చేయి చేసుకున్నాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన దేవందర్.. రితీష్ పై సందర్శినీ ఓనర్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో స్పందించిన సందర్షిని ఎలైట్ అధికారులు నెల క్రితం రితీష్ ను మేనేజర్ గా తొలగించారు.
దీంతో కక్ష పెంచుకున్న రితీష్.. దేవేందర్ ను చంపేందుకు ప్లాన్ వేశాడు. బైక్‌పై వచ్చిన రితీష్ హోటల్‌లో పలుమార్లు రెక్కీ నిర్వహించాడు. బుధవారం దేవందర్ ఒక్కడే ఉండటం గమనించిన రితీష్ అతనిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో దేవందర్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులు జరిపిన రితీష్ ను పట్టుకునేందుకు 5 బృందాలుగా ఏర్పడి ఎట్టకేలకు అదుపులో తీసుకున్నారు. కాల్పుల ఘటన పై ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మాదాపూర్ డీసీపీ ప్రెస్ మీట్ నిర్వహించి వీటిపై వివరణ ఇవ్వనున్నారు.
Read also: Medak BRS: మదన్ రెడ్డికే నర్సాపూర్ టిక్కెట్ ఇవ్వాలి.. హరీష్‌రావ్ ఇంటి వద్ద ఆందోళన..
ఇక్కడే ట్విస్ట్ ఏర్పడింది. దినేష్, రితీష్ కు మధ్య గొడవకు కారణమైన ఆమె ఎవరు? అసలు ఆమెకు వీరిద్దరికి సంబంధం ఏమిటి? అని రితీష్ తో ఆమెకు సంబంధ ఉంటే.. మరి దినేష్ ఎందుకు ఆ అమ్మాయి విషయంలో కలుగచేసుకున్నాడు? ఆ అమ్మాయికి దినేష్ కి సంబంధం ఏమైనా ఉందా? వీరిద్దరి మధ్య గొడవకు దారి తీసేంత ఆ అమ్మాయి ఎవరు? ఎక్కడ నుంచి వచ్చింది. ఒక వేళ రితీష్ ఆ అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు అనుకున్నా.. మరి దినేష్ ఎందుకు వీరిద్దరి మధ్య ఉన్నాడు. ఆ అమ్మాయికి దినేష్ కు వివాహేతర సంబంధ ఉండటంతోనే రితీష్.. దినేష్ ను చంపాడా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అసలు ఆ అమ్మాయిని పోలీసులు అదుపులో తీసుకున్నారా? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
Team India Captain: రాసి పెట్టుకోండి.. భవిష్యత్తులో టీమిండియాకు అతడే కెప్టెన్