Site icon NTV Telugu

ఏఆర్ కానిస్టేబుల్ సంధ్యరాణి కేసులో కొత్త ట్విస్ట్

ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సంధ్యారాణి గతంలో రెండు వివాహాలు చేసుకున్న విషయాన్ని దాచిపెట్టి తనను వలలో వేసుకొని ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకుందని భర్త చరణ్‌తేజ డీసీపీకి ఈ–మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తనను వివిధ రకాలుగా వేధిస్తున్నట్లు చెప్పాడు. తనను తీవ్రంగా కొట్టడంతో పాటు తల్లిదండ్రులు, స్నేహితులను కలవనీయకుండా చేస్తోందన్నారు. సంధ్యారాణి కుటుంబం నుంచి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు.

అయితే ఈ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. కానిస్టేబుల్ సంధ్యరాణిపై భర్త చరణ్ తేజ దుష్ప్రచారం చేసినట్లు విచారణలో వెల్లడైంది. పెళ్లి చేసుకొని మోసం చేసినట్లు భర్త చరణ్ తేజ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కులం పేరుతో దూషించి , వేధింపులకు గురిచేస్తున్నట్లు కానిస్టేబుల్ సంధ్యరాణి ఫిర్యాదులో పేర్కొంది. ఐపీసీ 498A, 506, వరకట్న నిరోధక చట్టంతో పాటు ఎస్సీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. చరణ్ తేజను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు రిమాండ్ కి తరలించారు.

Exit mobile version