Site icon NTV Telugu

సింగరేణి అక్రమ మైనింగ్‌..! ఎన్జీటీ ఆగ్రహం

Singareni

Singareni

సింగరేణి అక్రమ మైనింగ్‌ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్… కీలక ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా అదనపు మైనింగ్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. అదనపు మైనింగ్‌పై ఆధారాలను ట్రిబ్యునల్‌కు కమిటీ సమర్పించగా.. అక్రమ మైనింగ్ చేసినందుకు నష్టపరిహారం చెల్లించాలని, పర్యావరణ కాలుష్య బాధితులకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది ఎన్జీటీ.. ఇక, పర్యావరణ కాలుష్యంపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారంటూ తెలంగాణ పీసీబీపై అసంతృప్తి వ్యక్తం చేసిన గ్రీన్‌ ట్రిబ్యునల్.. ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 12వ తేదీకి వాయిదా వేసింది.

Exit mobile version