National Commission for Scheduled Tribes Comments on Adilabad Collector Sikta Patnaik: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పై జాతీయ ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా పరిధిలోని యాపల్ గూడ, రాంపూర్ గ్రామాల్లో రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ భూ నిర్వాసితుల కేసులు విచారణలో భాగంగా కలెక్టర్ ను ప్రశ్నించింది. ప్రైవేటు సిమెంట్ ఫ్యాక్టరీ ఎస్టీల భూములను సేకరిస్తుంటే ఏం చేశారని.. కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 107 ఎకరాల భూమిని తిరిగి భూ నిర్వాసితులకు ఎందుకు ఇవ్వకూడదో వివరణ ఇవ్వాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను ఆదేశించింది ఎస్టీ కమిషన్. భూమి ఇప్పించిన ఎమ్మెల్యే జోగు రామన్న, ఆర్డీఓ సూర్యనారాయణ పై ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎందుకు పెట్టకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది కమిషన్. తదుపరి విచారణను నెల రోజులకు వాయిదా వేసింది.
READ ALSO: Tamilisai Soundararajan: గవర్నర్ ని కలిసిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
2018లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం గిరిజనుల నుంచి భూమని సేకరించింది యాజమాన్యం. అయితే గిరిజనుల నుంచి భూమిని తీసుకుని మూడేళ్లు అయినా.. ఫ్యాక్టరీ ఏర్పాటు కాలేదు. ఈ నేపథ్యంలో తాము ఫ్యాక్టరీకి ఇచ్చిన వ్యవసాయ భూమిని తిరిగి ఇచ్చేయాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. భూమిని కోల్పోయిన వారి కోసం ఆదిలాబాద్ జిల్లా మాజీ చైర్మన్ సుహాసిని రెడ్డి న్యాయపోరాటం చేస్తోంది. ఈమె భూమిని కోల్పోయిన వారి కోసం జాతీయ ఎస్టీ కమిషన్ లో పటిషన్ వేశారు.