Komatireddy: మూసీ నీ నిర్లక్ష్యం చేయడం వల్ల తెలంగాణా తెచ్చుకున్నా. నల్లగొండ జిల్లా కు ప్రయోజనం లేకుండా పోయిందని రోడ్లు సినిమాటోగ్రఫీ, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద 10 పడకల ట్రామా కేర్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. CSR నిధుల ద్వారా ట్రామా కేర్ సెంటర్ నిర్మాణానికి ముందుకు వచ్చిన ADP సంస్థ అన్నారు. సెప్టెంబర్ లో హైదరాబాద్ – విజయవాడ ఎక్స్ ప్రెస్ హైవే పనులు ప్రారంభం అవుతాయన్నారు. రెండు సంవత్సరాల్లో ఎక్స్ ప్రెస్ హైవే పనులు పూర్తి చేస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా ఎస్పీలు అవగాహన కార్యక్రమాలు చెప్పట్టాలన్నారు. మూసీ ప్రక్షాళన నిర్ణీత కాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. మూసి నీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.
Read also: Telangana Govt: కాంగ్రెస్ నేతలకు వైఎస్ఆర్ జయంతి కానుక.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..
మూసీ నీ నిర్లక్ష్యం చేయడం వల్ల తెలంగాణా తెచ్చుకున్నా… నల్లగొండ జిల్లా కు ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. ఎక్సైజ్ శాఖ, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది… కానీ ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల కారణంగా.. జరిగే మృతుల సంఖ్యను తగ్గించేందుకు అందరూ కలిసి పని చేయాలని తెలిపారు. 65 వ నంబర్ జాతీయ రహదారి రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిందన్నారు. నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు… ఇంటికి క్షేమంగా వెళ్తానా లేదా అని భయం ఉంటుందన్నారు. రోడ్ల విస్తరణ కోసం గడ్కరీ ని అనేకసార్లు కలిశాను.. దీంతో నా పేరును nh 65గాను, విజయవాడ హైదరాబాద్ హైవేగా మార్చేశారని తెలిపారు.
Jagga Reddy: చేతిలో తల్వార్‌తో స్టేజ్ పై స్టెప్పులేసిన జగ్గారెడ్డి..