Raj Gopal Reddy: నల్లగొండ జిల్లాలోని మునుగోడు పట్టణంలో వైన్ షాపులను ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నకిలీ మందు అమ్ముతున్నారా అని అడుగుతూ మద్యం బాటిల్స్ పరిశీలన చేశారు. వైన్స్ పక్కనే ఉన్న పర్మిట్ రూములను సైతం ఆయన పరిశీలించారు. పర్మిట్ రూముల్లో ఉదయాన్నే మద్యం తాగుతున్న మందు బాబులకు క్లాస్ పీకారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఉదయాన్నే పర్మిట్ రూంలలో కూర్చుంటే కుటుంబ పరిస్థితి ఏంటని సీరియస్ అయ్యారు.
Read Also: Delhi : కేజ్రీవాల్‌పై ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు
ఇక, మందు బాబులను పర్మిట్ రూముల నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బయటికి పంపించారు. ఉదయం పూట పర్మిట్ రూముల్లోకి ఎవరికి అనుమతి ఇవ్వొద్దంటూ వైన్ షాపుల యజమానులకు హుకుం జారీ చేశారు. బెల్ట్ షాపులకు మద్యం అమ్ముతున్నారా అంటూ ఆరా తీశారు. బెల్డ్ షాపులకు మద్యం విక్రయిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గ్రామాల్లో మద్యం అమ్మకాలు జరగకుండా కట్టడి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.