NTV Telugu Site icon

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న భారీ వరద..

Nagarjuna Sagar

Nagarjuna Sagar

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది. సాగర్ ప్రాజెక్ట్ 20 గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి 1,62,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. ఎగువన శ్రీశైలం నుండి నాగార్జునసాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో 20 గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో : 2,10,408 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 2,10,408 క్యూసెక్కులు కొనసాగుతుంది. ప్రస్తుత నీటి మట్టం : 590.00 అడుగులు కాగా.. పూర్తి స్థాయి నీటి మట్టం : 590.00 అడుగులు.. ఇక ప్రస్తుత నీటి నిల్వ : 312.0450 టీఎంసీలు కాగా.. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450 టీఎంసీలుగా కొనసాగుతుంది. జలవిద్యుత్ కేంద్రం ద్వారా 29,394 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 9160 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 8280 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బిసి ద్వారా 1800 క్యూసెక్కులు, లోలెవల్ కెనాల్ ద్వారా 600 క్యూసెక్కులు, మొత్తం 2,10,408 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. దిగువకు విడుదల చేయబడింది.

Read also: Medchal Crime: హాస్టల్‌ ఫీజు వ్యవహారంలో గొడవ..? యువకుడు మృతి..

మరోవైపు మహబూబ్ నగర్ జిల్లా జూరాలకు భారీ వరద ప్రవాహం కొనసాగుతుండటంతో.. 42 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ ఫ్లో : 2,50,305 వేల క్యూ సెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 2,59,749 వేల, క్యూ సెక్కులు.. ఇక పూర్తిస్థాయి నీటిమట్టం :1045 ఫీట్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం :1042.093 ఫీట్లుగా కొనసాగుతుంది. పూర్తి నీటి సామర్థ్యం: 9.657 టీఎంసీలు.. ప్రస్తుత నీటి నిల్వ: 7.894 టీఎంసీలుగా కొనసాగుతుంది. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల నుంచి 9 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.. ఎత్తి పోతల పథకాలకు నీటి విడుదలకు చర్యలు చేపట్టారు అధికారులు.
Komatireddy Venkat Reddy: నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన..