Site icon NTV Telugu

Mulugu: క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో స్థానికులు..

Mulugu

Mulugu

Mulugu: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని బెస్తగూడెం గ్రామ సమీపంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గ్రామంలోకి వెళ్లే మూల మలుపు వద్ద ఓ చెట్టుకి చీర కట్టి అక్కడ గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి క్షుద్ర పూజలు చేసినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో కుంకుమ, పసుపు, నిమ్మకాయలు పేర్చి, కోడిని కోసి వదిలిపెట్టిన ఆనవాళ్లు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. రోడ్డుపై ముగ్గేసి క్షుద్ర పూజలు చేసినట్లుగా ఆనవాళ్లతో పాటు.. దాని చుట్టూ రక్తపు మరకలు ఉండటం చూసిన గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. చెట్టుకు చీర కట్టి క్షుద్ర పూజలు చేసినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇలా గ్రామానికి వెళ్లే దారిలో క్షుద్ర పూజలు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గ్రామంలోకి రావాలన్నా ఆ..దారి నుంచి రావాల్సి ఉంటుందని తెలిపారు. చిన్నారు కూడా అక్కడి నుంచే రావాల్సి ఉంటుందని.. పిల్లలకు ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటని తెలిపారు. ఇలాంటి క్షుద్ర పూజలు గ్రామానికి అరిష్టం చేయడానికే ఎవరైనా ఇలా చేస్తున్నారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. తరచూ ఇదే ప్రదేశంలో క్షుద్ర పూజలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
MLA Madhavaram: ప్రజలను సంక్షేమ పథకాల నుండి దారి మళ్లించేందుకు హైడ్రా కూల్చివేతలు..

Exit mobile version