NTV Telugu Site icon

Minister Sitakka: ములుగులో 500 ఎక‌రాల్లో చెట్లు నేల‌కొర‌గ‌డంపై మంత్రి సీత‌క్క ఆరా..

Minister Seetakka

Minister Seetakka

Minister Sitakka: ములుగులో 500 ఎక‌రాల్లో చెట్లు నెల‌కొర‌గ‌డంపై మంత్రి సీత‌క్క ఆరా తీశారు. రాష్ట్ర స‌చివాల‌యం నుంచి పీసీసీఎఫ్‌, డీ ఎఫ్ ఓల‌తో మంత్రి సీత‌క్క‌ టెలిఫోన్ లో మాట్లాడారు. రెండు రోజుల క్రితమే చెట్లు నెల‌కొరిగిన ప్రాంతాన్ని సంద‌ర్శించారు. ల‌క్ష చెట్ల వ‌ర‌కు నెల‌కూల‌డం ప‌ట్ల మంత్రి విస్మ‌యం చెందారు. ఈ స్థాయిలో అట‌వి విద్వంసం జ‌ర‌గ‌డం ప‌ట్ల ఆశ్చ‌ర్యం కలిగించిందని తెలిపారు. అనంతరం సీత‌క్క మాట్లాడుతూ.. ములుగు అడవుల్లో సుడిగాలి వల్ల లక్ష చెట్ల వరకు నెలకొరిగాయని, వందల ఎకరాల్లో నష్టం వాటిల్లిందన్నారు. వృక్షాలు కూలడంపై విచారణకు ఆదేశించామని తెలిపారు. డ్రోన్ కెమెరాల సహాయంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.

Read also: Ponnam Prabhakar: ప్రకృతి విపత్తును అపగలిగే శక్తి ఎవరికీ లేదు..

నేడు ఘటన ప్రాంతాన్ని సందర్శించి పిసిసిఎఫ్ నివేదిక సిద్ధం చేస్తారన్నారు. అడవిలో సుడిగాలి వచ్చింది కాబట్టి ప్రాణనష్టం జరగలేదన్నారు. ఈ సుడిగాలి గ్రామాల్లో సంభవించి ఉంటే పెను విధ్వంసం జరిగేదని తెలిపారు. స‌మ‌క్క సార‌ల‌మ్మ త‌ల్లుల ద‌య వ‌ల్లే సుడిగాలి ఊర్ల మీద‌కు మ‌ల్ల‌లేదన్నారు. త‌ల్లుల దీవేన‌తోనే ప్ర‌జ‌ల‌కు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ‌గ‌లిగారని తెలిపారు. చెట్లు నెల‌కూల‌డంపై కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ ప్ర‌త్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రం నుంచి ప‌రిశోధ‌న జ‌రిపించి కార‌ణాలు గుర్తించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అట‌వి ప్రాంతంలో చెట్ల‌ను పెంచేలా ప్ర‌త్యేక నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క తెలిపారు.
Intikanne Railway Track: ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ పనులు పూర్తి.. ట్రాక్ పై ట్రయల్ రన్