Site icon NTV Telugu

Mulugu Agency: ములుగు ఏజెన్సీలో చలి పంజా.. కమ్మేసిన పొగ మంచు..

Mulugu Cold

Mulugu Cold

Mulugu Agency: తెలంగాణలో మళ్లీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది.హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గత వారం రోజులుగా సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గత వారం రోజులుగా సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైరాబాద్‌తో పాటు ములుగు ఎజెన్సీ, ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా, కొమురం భీం, నిర్మల్‌, మంచిర్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. చలి తీవ్రతతో స్థానికులు చలి మంటలు పెట్టుకుంటున్నారు.

Read also: AUS Playing XI: మూడో టెస్టుకు ఆస్ట్రేలియా తుది జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. డేంజరస్ బౌలర్ వచ్చేశాడు!

ఇక ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత గత నాలుగు రోజులుగా రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల తేడా లేకుండా చలి ప్రజలను వణికిస్తుంది. దీంతో ఉదయం 8 గంటల వరకు ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. చలి ప్రభావంతో దట్టమైన పొగ మంచు కమ్మేస్తుంది. దట్టమైన పొగ మంచు కారణంగా రోడ్లు సరిగ్గా కనబడక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక హెడ్ లైట్లు వేసుకుని గంటల తరబడి నెమ్మదిగా రాకపోకలు సాగిస్తున్నారు. వాహనాలకు లైట్లు వేసుకొని వెళ్లినా ఎదుటివారు కనిపించే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బందికి గురవుతున్నారు. చలి గాలులు ఎక్కువ అయ్యి రైతులు, వృద్ధులు, పిల్లలు, పెద్దలు, చలి ఎక్కువగా ఉండడంతో చలి మంటలు వేసుకొని మంటల దగ్గరే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.
Hyderabad Crime: బేగంబజార్‌లో జంట హత్యలు.. ఘటనపై క్లారిటీ ఇచ్చిన అబిడ్స్ ఎసీపీ..

Exit mobile version