NTV Telugu Site icon

Viral Fever: వైరల్ ఫివర్స్ తో వణుకుతున్న ములుగు ఏజెన్సీ.. ఏ పల్లె చూసిన జ్వర పీడుతులే..

Mulugu Firal Fiver

Mulugu Firal Fiver

Viral Fever: ములుగు ఏజెన్సీ వైరల్ ఫివర్స్ తో వనికి పోతుంది.. ఏ పల్లె చూసిన జ్వరం బారిన పడ్డవాళ్లే కనిపిస్తున్నారు. ములుగు జిల్లా లోని ఏజెన్సీ మండలాలైన ఎటురునాగారం కన్నాయిగూడెం, మంగపేట, తాడువాయి, వాజేడు, వెంకటాపురం మండలాల్లో డెంగ్యూ, మలేరియా పాజిటివ్ కేసులో జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న డెంగ్యూ మలేరియా జ్వరాలతో ఊరు ఊరు మొత్తం బిక్కు బిక్కు మంటు రోజు గడుపుతున్నారు. ఈ విష జ్వరాలా భారిన పడి ఇప్పఇకే పదుల సంఖ్యలో ప్రాణాలు వదిలారు. ఏటూరు నాగారం ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే ఒక స్టాఫ్ నర్స్…..తాడ్వాయి మండలం రంగాపూర్ కు చెందిన రంగారావు అనే రైతు మృత్యువాత పడ్డారు. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన దివ్య అనే గృహిణి డెంగ్యూ జ్వరం పెరగడంతో జిల్లా కేంద్రం లోని ఎంజిఎం కి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. మంగపేట మండలం ఓడగుడెం లోని ఎస్సి కాలనికి చెందిన రామాక్క అనే
వృద్ధురాలు ప్రవేట్ హాస్పిటల్లో చూపించుకున్నప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో జిల్లా కేంద్రంలోని ఎంజిఎం తరలించారు అక్కడ కూడా తగ్గకపోవడంతో ,ఎంజిఎం చికిత్స పొందుతూ మృతి చెందింది ఇలా జ్వరంతో చనిపోవాదంతి వారి కుటుంబాల్లో విషాదఛాయలు అమ్ముకున్నాయి.

తాజాగా.. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని ఒడిస్సా కాలనీకి చెందిన 3 ఏళ్ల చిన్నారి బోయ అక్షర రెండు రోజులుగా విష జ్వరం తో ఇభంది పడింది.. పరిస్థితి విషమిచడం తో మణుగూరు లోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలిస్తుండగ నేడు మృతి చెందింది.. చిన్నారి మృతితో ఒక్కగాను ఒక్క కూతురు చనిపోవడం తో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు. వైరల్ ఫివర్స్ బారిన పడి చనిపోతున్న జనం సంఖ్య పెరగడంతో ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలు ఏ చిన్న జ్వరం వచ్చిన గ్రామాల్లోని ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి పరిగెత్తుతున్నారు, అక్కడ రెండు రోజులు మందులు వాడగానే స్థానిక గవర్నమెంట్ హాస్పటల్ చుట్టూరా తిరుగుతూన్నారు అక్కడ కూడా తగ్గకపోయే సరికి అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని పెద్ద ఆసుపత్రులకు వెళ్లి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ప్రతిరోజు గ్రామాల్లోమి పిహెచ్ సీల్లో 100 నుండి 150 ఓపి వస్తున్నాయి. మండల కేంద్రంలోని ప్రయివేటు ,ప్రభుత్వ ఆసుపత్రూలు జ్వరం పిడితులతో నిండిపోతున్నాయి అయిన జ్వరం తగ్గకుంటే 120 కిలోమీటర్ల దూరం లో వరంగల్ ఎంజీఎంకి కానీ ప్రైవేటు ఆసుపత్రికి కానీ వస్తున్నారు. అయితే ములుగు జిల్లా వైద్యాధికారి అప్పయ్య మాత్రం ములుగు జిల్లాలో రోజురోజుకు జరపీడుతులు పెరుగుతున్నారని, అయితే జ్వరం వచ్చినా అది డెంగ్యూ కాదని భయపడాల్సిన పనిలేదని, మందులు వాడుతూ రెస్ట్ తీసుకోవాలని సూచిస్తున్నారు ఇంటి పరిశుభ్రంగా చేసుకోవాలని దోమలు ఎక్కువగా ఉన్నా నేపథ్యం లో దోమతెరలు వాడాలంటున్నారు.
MLC Kasireddy: బీఆర్ఎస్ కు కసిరెడ్డి రాజీనామా.. రేవంత్ రెడ్డితో భేటీ