తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్ ఎంపీ మాలోత్ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అరె బండి సంజయ్…ఫాల్తూ ముచ్చట్లు వద్దు అంటూ నిప్పులు చెరిగారు. 12 ఎస్టీ నియోజకవర్గాల్లో దమ్ము ఉంటే నీ పార్టీకి డిపాజిట్ తెచ్చుకో అని బండి సంజయ్‌ని ఎంపీ కవిత ఛాలెంజ్ చేశారు.నీవు మోగోడివి అయితే …సమక్క సారలమ్మా జాతరకు వెయ్యి కోట్లు తీసుకురా అని బండి సంజయ్‌కి సవాల్ విసిరారు ఎంపీ కవిత. బండి సంజయ్ కేంద్రం నుంచి వెయ్యి కోట్లు తెస్తే… నేను సన్మానం చేస్తా అంటూ చురకలు అంటించారు.
Read Also: బండి సంజయ్‌కి మంత్రి సత్యవతి రాథోడ్ సవాల్..
తండాకు రా బండి సంజయ్ …మోడీ ఏం చేసారో… కేసీఆర్ ఏం చేసారో తేల్చుకుందామని సవాల్ విసిరారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర అసెంబ్లీ తీర్మాణం చేసి పంపితే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ ఏ నిర్ణయం తీసుకోలేదని… తెలంగాణ అభివృద్ధి కేవలం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని కవిత పేర్కొన్నారు. పచ్చగా ఉన్న రాష్ట్రంలో విద్వేషాలను రెచ్చగొడుతూ మత రాజకీయాలను చేయాలని చూస్తోందని కవిత బీజేపీ, బండి సంజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవ్వరూ ఎన్ని చేసినా తెలంగాణ అభివృద్ధిని ఆపలేరన్నారు.
