NTV Telugu Site icon

Dharmapuri Arvind: కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో లో గల్ఫ్ బోర్డ్ లేదు..

Mp Arvind

Mp Arvind

Dharmapuri Arvind: కాంగ్రెస్ జాతీయ మ్యానిఫెస్టో లో గల్ఫ్ బోర్డ్ లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీ లపై కాంగ్రెస్ నేతలు పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఫ్యాక్టరీలు తెరిపించాలనే ఉద్దేశ్యం ఆ పార్టీకి లేదన్నారు. కేవలం ఎన్నికల స్టెంట్ మాత్రమే అన్నారు. చేరకు రైతులను మభ్య పెట్టేందుకు కాంగ్రెస్ కొత్త డ్రామా అని తెలిపారు. షుగర్ ఫ్యాక్టరీ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read also: Darshan Mogulaiah : రెండేళ్ల కింద పద్మశ్రీ అందుకున్నాడు. నేడు కూలి పనికి పోతున్నాడు

బ్యాంక్ బకాయిలతో పాటు ప్రైవేటు భాగస్వామి కి కూడా డబ్బులు చెల్లించాల్సి ఉందన్నారు. రిజర్వేషన్ల పై కాంగ్రెస్ వి ఓటు బ్యాంకు రాజకీయాలన్నారు. కాంగ్రెస్ నిర్ణయాలతో ఎస్సి, ఎస్టీ, బిసిలు బలవుతున్నారన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ వెళ్లే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ జాతీయ మ్యానిఫెస్టో లో గల్ఫ్ బోర్డ్ లేదన్నారు. 2 లక్షల ఋణ మాఫీ ఇస్తానని రేవంత్ ప్రమాణాలు చేస్తుంటే పార్టీ మాత్రం కమిటీ వేస్తామని అంటోందన్నారు. ఆత్మాభిమానం ఉంటే మంత్రులు, సభ్యులు షుగర్ ఫ్యాక్టరీ కమిటీ లకు రాజీనామా చేయాలన్నారు.

Read also: Rahul Gandhi: రాయ్‌బరేలీలో రాహుల్ నామినేషన్.. వెంట సోనియా, ప్రియాంక

కాంగ్రెస్ మేనిఫెస్టోను ఏప్రిల్ 6న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన జాతర సభలో 5 హామీలతో కూడిన మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ హామీలు తప్పక అమలు అవుతాయని ప్రజలు విశ్వసిస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆరు హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి అమలు చేస్తున్నామని తెలిపారు. జాతీయ స్థాయిలో 5 హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ మేనిఫెస్టో సిద్ధం చేసింది. అయితే కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో గల్ఫ్ బోర్డ్ గురించి ప్రస్తావన లేదని అరవింద్ మండపడ్డారు.
Amethi: అమేథీలో నామినేషన్ వేసిన కేఎల్ శర్మ