Site icon NTV Telugu

అంబేద్కర్ వారసుడిగా కేసీఆర్ మిగిలిపోతారు : మోత్కుపల్లి

తన ఆలేరు నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించడం సంతోషమని…వాసాలమర్రి గ్రామ దళితుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు మోత్కుపల్లి నర్సింహులు. దేశానికే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి కేసీఆర్ అని… అన్ని పార్టీలు దళితులను దళితులుగానే చూశారు తప్ప… నేరుగా దళితుల ఖాతాల్లో పది లక్షల రూపాయలు వేయడం ఎక్కడా చూడలేదన్నారు.

Read Also : ‘గని’ రిలీజ్ డేట్… ఇంకా సస్పెన్స్ ఏంటి వరుణ్ ?

రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికి దళిత బంధు ఇస్తారనడానికి వాసాలమర్రె నిదర్శనమని… ప్రతిపక్ష పార్టీలు వారు అధికారంలో ఉన్న రాష్టాల్లో దళిత బంధు అమలు చేసే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. దళిత బంధు దేశం మొత్తం అమలు చేసే విధంగా జాతీయ పార్టీలు వారి అధిష్ఠానాలను ఒప్పించాలని…హుజురాబాద్ నియోజకవర్గానికే పరిమితం అని దళిత బంధు పై అవాకులు చెవాకులు మాట్లాడిన వారు ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాలని ఫైర్‌ అయ్యారు. దళితులకు ఆర్థిక పరిపుష్టి కల్పిస్తే రాబోయే రోజుల్లో అంబేద్కర్ వారసుడిగా కేసీఆర్ మిగిలిపోతారన్నారు.

Exit mobile version