Site icon NTV Telugu

Montha Cyclone: వరదలో కొట్టుకుపోయిన యువతీ యువకులు

Untitled Design (24)

Untitled Design (24)

తెలుగు రాష్ట్రాల్లో ‘మొంథా’ తుఫాన్ బీభత్సం సృష్టిచింది.. తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసాయి. దీంతో వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వరదలతో రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Read Also: Skywalks: మరో ఆరు స్కై వాక్ లపై దృష్టి పెట్టిన ప్రభుత్వం

మొంథా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలం అయ్యింది.. కొన్ని గంటల పాటు కనివిని ఎరుగని స్థాయిలో భారీ వర్షం కురిసింది. దాదాపు 42.2 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. దీంతో చెరువులు కుంటలు తెగి.. వరద నీరు అంతా ఇళ్లలోకి చేరింది. చిన్న చితక వాగుల నుంచి నదుల వరకు పొంగి పోర్లుతున్నాయి. దీంతో జనగామ జిల్లాలో ఎక్కడ చూసిన వరదలే దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో మత్తడిని దాటేందుకు ప్రయత్నించిన యువతీ యువకులు బైక్‌తో పాటు వరదలో కొట్టుకుపోయారు.

Read Also:Digital Car Key: ఇకపై ఫోన్ తోనే కార్ అన్ లాకింగ్..కొత్త ఫీచర్ తో వస్తున్న శాంసంగ్ గెలాక్సీ

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తిమ్మంపేట శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. బరిగెల శివకుమార్, బక్క శ్రావ్య ఇద్దరు యువతీ యువకులు బైక్ వెళ్తుండగా.. బోళ్ల మత్తడి ప్రవాహం అధికంగా ఉండటంతో ఇద్దరు నీటిలో పడి పోయారు. అయితే శివ కుమార్ మాత్రం చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాలతో బయటపడగా.. శ్రావ్య నీటిలో కొట్టుకుపోయింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్తులు, రెస్క్యూ సిబ్బందితో కలిసి.. యువతి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Exit mobile version