NTV Telugu Site icon

MLC Kavitha: ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ.. ఆ.. విషయంపై ప్రశ్నల వర్షం

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్ర కు కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. ఫోన్ల ధ్వంసం ఆరోపణ చేయడాన్ని కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుపట్టారు. దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నేను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఈవిషయాన్ని ఆమె మీడియాకు తన ఫోన్లును సైతం చూపించారు. ఒక మహిళ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా? అంటూ ప్రశ్నించారు. దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ నేను ధ్వంసం చేశానని పేర్కొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను కనీసం సమన్ చేయకుండా లేదా అడగకుండానే ఏ పరిస్థితుల్లో ఎందుకు దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసింది ? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

Read also: MLA Raja Singh: లైసెన్స్ గన్ ఇవ్వండి.. డీజీపీ కి రాజాసింగ్ లేఖ

నన్ను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచిందని, కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడి ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే కదా అని లేఖలో ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువును, మా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగిందని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడీ వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ కవిత లేఖలో పేర్కొ్న్నారు. అయితే దీనిపై ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్ర ఎలా స్పందించనున్నారు. కవిత రాసిన లేఖపై ఆయన ఎలాంటి యాక్షన్‌ తీసుకోబోతున్నారనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది.

ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇవాల ఉదయం 11 గంటల 30 సమయంలో ఈడీ ఆఫీసుకి చేరుకున్నారు. ఆమె వెంట భర్తతోపాటు.. ఇతర బీఆర్ఎస్ లీడర్స్ వున్నారు. అయితే ఈడీ ఆఫీసులోకి కవితను ఒక్కరినే అనుమతించారు అధికారులు. కవిత విచారణకు హాజరుకావటం ఇది మూడో సారి. మార్చి 11, మార్చిలోనే 20వ తేదీ సోమవారం 10 గంటలకు పైగా ఆమెను విచారించారు అధికారులు. ఇవాళ 21న మళ్లీ హాజరుకావాలని నోటీసులు ఇవ్వడంతో.. ఈక్రమమంలోనే కవిత ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు.

ఇక.. మరో వైపు ఈడీ ఆఫీస్ దగ్గర కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్న నేపథ్యంలో పోలీసులు భారీగా చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవిత విచారణలో ఇవాళ కీలక పరిణామాలు ఉంటే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతుండటంతో ఎటువంటి సంఘటనలు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. కాగా ఈనేపథ్యంలోనే కవిత తన వెంట గతంలో ఉపయోగించిన ఫోన్లను కూడా ఈడీ ఆఫీసుకు తీసుకురావటం సంచలనంగా మారింది. కవిత 10 ఫోన్లు వాడినట్లు ఈడీ అభియోగం చేసిన విషయం తెలిసిందే.. 2021 నుంచి ఆగస్టు 2022 వరకు 10 ఫోన్లు వాడినట్లు ఈడీ ఆరోపణల నేపథ్యంలో ఇవాల కవిత తన వెంట ఫోన్లు తీసుకురావడంతో విచారణ కీలకంగా మారింది.