Site icon NTV Telugu

MLC Jeevan Reddy: నేత కార్మికులంటే అంత నిర్లక్ష్యమా?

సిరిసిల్ల పట్టణంలో కొనసాగుతున్న నేత కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపేందుకు వచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఆసాములకు 10శాతం రావాల్సిన యారాన్ సబ్సిడీని వెంటనే అమలు చేయాలి. కార్మికులకు కూలీ ఒప్పందం ప్రకారం పెంచిన కూలీ రేట్లు ఇవ్వాలి. ప్రతి నేత కార్మికునికి నెలకు 23 వేల జీతం రావాలన్నారు జీవన్ రెడ్డి.

https://ntvtelugu.com/errabelli-dayakarrao-fires-on-bjp/

నేత కార్మికులు సుఖశాంతులతో వర్ధిల్లుతారని తెలంగాణ ప్రాంతం మొత్తం అనుకుంటుంది. కానీ చేనేత కార్మికులకు ఆసాములకు కూలీ గిట్టుబాటు కావడం లేదు. మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి, ఒప్పందం ప్రకారం పెంచిన కూలీ విధానాన్ని అమలు చేయాలి. నేత కార్మికులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో విధిలేని పరిస్థితుల్లో రోడ్డెక్కారు. వారి పట్ల కనికరం చూపాలి. ఐదు సంవత్సరాల క్రితం కూలీ ఏదైతే ఉందో ఇవాళ కూడా అదే ఉంది. నేత కార్మికుల సమ్మపై వెంటనే ప్రభుత్వం స్పందించాలన్నారు.

Exit mobile version