NTV Telugu Site icon

MLA Shankar Nayak: మానుకోట రాళ్ల రుచి రేవంత్ కు తెలియదు నేను సైగ చేస్తే..

Mla Shankar Nayak

Mla Shankar Nayak

MLA Shankar Nayak: నేను సైగ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని మహబూబ్ బాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఒక రోగ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నా పై ఇష్టం వచ్చినట్లు రేవంత్ మాట్లాడారని మండిపడ్డారు. నేను సైగ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని, మానుకోట రాళ్ల రుచి రేవంత్ కు తెలియదని అన్నారు. భూమికి మూడు ఫీట్లు ఉన్నాడు రేవంత్ నాకు గురించి ఏమి మాట్లాడతావంటూ మాండిపడ్డారు. ఎర్రబెల్లి ఎదురు లేని నాయకుడు ఆయన్ని విమర్శిస్తావా ? అంటూ ప్రశ్నించారు.

Read also: Credit card fraud: కార్డులు స్వైప్ చేసాడు..5 కోట్ల రూపాయలు కాజేశాడు..

రసమయి బాలకిషన్ ఉద్యమకారుడు, విద్యావంతుడు మంత్రిని చేయొచ్చు కదా? అంటూ ప్రశ్నించారు. ఏబీసీడీలు రాని ఎర్రబెల్లిని కులం చూసుకొని మంత్రిని చేశారని తెలిపారు. ఆయన మంత్రిత్వ శాఖ పేరును తప్పులు లేకుండా రాయడం కూడా రాదు ఎర్రబెల్లికి అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కోవర్ట్ ఆపరేషన్లలో దయాకర్ రావు ఎక్స్పర్ట్ అంటూ మండిపడ్డారు. ఉద్యమ సమయంలో జానారెడ్డి కాళ్ళమీద పడ్డ వ్యక్తి కేసీఆర్‌ అంటూ మాట్లాడారు. తెలంగాణ పదాన్ని అసహ్యించుకున్న వాళ్ళను ప్రగతి భవన్ లో కూర్చోబెట్టిండు కేసీఆర్‌ అన్నారు. 90 శాతం తెలంగాణ ద్రోహులు మంత్రులుగా ఉన్నారని తీవ్రంగా ఆరోపించారు. కాంగ్రెష్ పార్టీ నుండి గెలిచి 12 మంది ఎమ్మెల్యేలల పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 3 వేల లిక్కర్ షాపులు.. 60 వేల బెల్టు షాపులు ఏర్పాటు చేసి ప్రజలనుతాగుబోతులను చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేయకపోవడంతో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు.
Top Headlines @9AM: టాప్ న్యూస్

Show comments