Pilot Rohit Reddy: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరుకాలేదు. ఇవాళ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ కార్యాలయంకు వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలతో హాజరు కావల్సి ఉంది. అయితే ఈడీ ఆఫీసుకు రోహిత్‌రెడ్డి పీఏ శ్రవణ్ వెళ్లారు. రోహిత్‌రెడ్డికి మరికొంత సమయం కావాలని కోరనున్నారు. చాలా తక్కువ సమయం ఇచ్చారని, సెలవుల కారణంగా బ్యాంక్ స్టేట్‌మెంట్స్ తీసుకు వచ్చేందుకు ఇబ్బందిగా ఉందని తెలిపారు. ఈడీ చెప్పిన ప్రకారం డాక్యుమెంట్లు కొన్ని మాత్రమే ఉన్నాయని ఇతర డాక్యుమెంట్లు తీసుకోలేకపోయామంటూ రోహిత్‌రెడ్డి పీఏ శ్రవణ్ తెలుపనున్నట్లు సమాచారం.
Read also: Week Movies: ఈ వారం సినిమాలు ‘అవతార్ 2’ దెబ్బకి గల్లంతవుతాయా?
అయితే ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో రోహిత్ రెడ్డి ప్రధాన ఫిర్యాదుదారుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక, రోహిత్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇటీవల నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక పత్రాలు, ఆదాయపు పన్ను రిటర్న్‌లను డిసెంబర్ 19లోగా సమర్పించాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. 2015 ఏప్రిల్ నుండి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు అందించాలని ఈడీ కోరింది. ఆధార్ కార్డు నుండి పాస్ పోర్టు వరకు 10 అంశాల బయోడేటా వివరాలతో విచారణకు రావాలని ఆదేశించింది ఈడీ. పైలెట్ రోహిత్ రెడ్డి విద్యార్హతలు, కేసుల వివరాలను ఈడి ఇచ్చిన ఫార్మాట్లో సమర్పించాలని ఆదేశం జారీచేసింది. ఎన్నికల అఫిడవిట్ లో విద్యార్హతలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. విద్యార్హతలు పత్రాలతో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులో పేర్కొంది. విచారానికి వచ్చే సమయంలో పాస్పోర్ట్ తో సహా విచారణ హాజరు కావాలని ఈడీ కోరింది. విదేశీ పర్యటనలపై ఈడీ ఇచ్చిన ఫార్మెట్లో పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈడీ నోటీసుల నేపథ్యంలో ప్రగతి భవన్‌లో ఆయన కేసీఆర్‌తో భేటీ సర్వత్రా ఆసక్తిగా మారింది. ఈరోజు ఈడీ ముందుకు రోహిత్ రెడ్డి గైర్హాజరు కాకుండా ఆయన పీఏ హాజరుపై చర్చకు దారితీస్తోంది.
Bigg boss: గెలిచి ఓడిన శ్రీహాన్, ఓడి గెలిచిన రేవంత్!!
