Miyapur Metro: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా మియాపూర్ నుంచి ఎల్బీనగర్ మెట్రో వరకు ఉదయం 10.30 నుంచి 11.30 గంటల మధ్య నల్ల టీ షర్టులు ధరించి ప్రయాణించాలని మద్దతుదారులు పిలుపునిచ్చారు. దీంతో ఉదయం పెద్ద ఎత్తున చంద్రబాబు అభిమానులు మియాపూర్, ఎల్బీనగర్ మెట్రో వద్దకు చేరుకున్నారు. కాగా మెట్రో స్టేషన్ కాలు పెట్టేందుకు కూడా జాగా లేకుండా పోయింది. దీంతో అక్కడి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హుటా హుటిన మియాపూర్, ఎల్బీనగర్ మెట్రో వద్దకు చేరుకున్నారు. పోలీసులు రావడంతో అక్కడే వున్న మద్దతుదారులు నినాదాలు చేపట్టారు. దీంతో మియాపూర్, ఎల్బీనరగ్ మెట్రో స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు ముందస్తుగా అక్కడికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్నారు. మియాపూర్, ఎల్బీనగర్ మెట్రో స్టేషన్‌ను మూసివేయాలని పోలీసులు అధికారులకు సూచించారు.
అప్రమత్తమైన మెట్రో అధికారులు సాంకేతిక సమస్య అని చెప్పి మియాపూర్, ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ ను కాసేపు మూసివేశారు. మెట్రో స్టేషన్‌ను మూసివేయడంతో ఆగ్రహించిన చంద్రబాబు మద్దతుదారులు మెట్రో స్టేషన్‌లో అధికారులతో వాగ్వాదానికి దిగారు. మంచికే కష్టాలు ఎక్కువ.. మండిపడ్డారు. శాంతియుత వాతావరణంలో నిరసనలు చేద్దామనుకుంటే.. మెట్రో అధికారులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. నిరసన కారులను లోపలికి రాకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో.. మియాపూర్, ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొద్ది సేపటి తర్వాత మెట్రోలో యదావిధిగా పనులు సాగడంతో అక్కడి పరిస్థితి సద్దుమణిగింది. మెట్రోలో చంద్రబాబు మద్దతు దారులు ప్రయాణిస్తూ నిరసన తెలిపారు.
Viral news: మొగుడు ఎందుకు మణీ వేస్ట్.. నాకు నేనే పెళ్లికి బెస్ట్