Mission Bhagiratha water: ష్ట్రంలోని ప్రతీ ఇంటికి మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. దీనికోసం వేలకోట్లు రూపాయాలను వెచ్చించింది. ప్రజలకోసం ఇంత ఖర్చు చేసిన సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రజాధనం వృధాగా మారుతుంది. నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా సర్కార్ పథకాలకు శ్రీకారం చుడుతుంటే క్షేత్రస్థాయిలో మాత్రం వీటి ఫలితాలు ఆశాజనకంగా లేకుండాపోతున్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది.
Read also: Apcc Deeksha:మోడీ హయాంలో సీబీఐ, ఈడీలు కీలుబొమ్మలు
ప్రస్తుతం మిషన్ భగీరథ పైపు పగిలి నీరు వృధాగా పోతున్న పట్టించుకునే వారు కరువయ్యారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రం సమీపంలోని శ్రీనివాస రైస్ మిల్ సమీపంలో జాతీయ రహదారి పక్కన చోటుచేసుకుంది. మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ పగిలి నీరు వృధాపోతూ సముద్రాన్ని తలపించేలా ఉవ్వెత్తున ఎగురుతూ సునామీని తలపించింది. ఉదృతంగా ఎగిసిపడుతున్న నీళ్లు మహబూబాబాద్ నర్సంపేట రహదారి మధ్యలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురుకొంటున్నారు. రహదారిపై వాహనాలు అటు ఇటు నిలిచిపోయాయి. నీటిని చూస్తూ ఉన్నవారే తప్పా దాన్ని వృధాపోకుండా ఆపేవారు లేకుండా పోయారు. ఇంతగా నీరు వృధాపోతున్నా ఏ అధికారి మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వృధా పోతున్న మిషన్ భగీరథ నీరు..