Nampally Fire Accident: నాంపల్లి బజార్ ఘాట్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన నగరం ఉలిక్కిపడేలా చేసింది. ఇవాళ ఉదయం 9.30 గంటలకు నాంపల్లిలో జరిగి భారీ అగ్ని ప్రమాదంలో చిన్నారితో సహా 9మంది మృతిచెందారు. దీంతో నాంపల్లి ప్రమాద ఘటన వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నాంపల్లి ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తక్షణమే పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.తీవ్రంగా గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాగా.. నాంపల్లి వద్ద పరిస్థితిని పరిశీలించడానికి.. మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లారు. అక్కడ పరిస్థితిని పరిశీలించి మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు.
ప్రమాదం జరిగిన బిల్డింగులు భవన యజమాని రమేష్ జైష్వాల్ గా గుర్తించారు అధికారులు. ఐదు అంతస్తుల భవనంలో రమేష్ జైష్వాల్ భారీగా కెమికల్ డబ్బాలు నిల్వచేశారు. రమేష్ జైష్వాలకి ప్లాస్టిక్ తయారు చేసే ఇండస్ట్రీ ఉన్నట్లుగా గుర్తించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో పెద్ద ఎత్తున కెమికల్స్ నిల్వచేసినట్లు సమాచారం. 150 పైగా కెమికల్ డబ్బాలను నిల్వచేసినట్లు అధికారులు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కెమికల్ డబ్బాలో ఒకసారిగా అగ్నిప్రమాదం జరిగింది. కెమికల్ డబ్బాల లో అగ్నిప్రమాదం సంభవించడంతో ఒక్కసారిగా భవనాన్ని వ్యాపించి మంటలు చెలరేగాయి.. మంటల్లో అద్దె కుంటున్న జనాలు ఒకరిబిక్కిరి అయి.. దట్టమైన పొగతో ఊపిరాడక చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. మంటలో మరికొందరు సజీవమైనట్లుగా గుర్తించారు. భవనంలో డీజిల్ పెట్రోల్ ఆయిల్ లేదని, మంటలకు కెమికల్ డబ్బాలే కారణమని పోలీసులు తెలిపారు.
నాంపల్లిలోని బజార్‌ఘాట్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ అపార్ట్‌మెంట్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగి ఐదు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. వీరిలో కొందరు ఊపిరాడక చనిపోగా, మరికొందరు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 8 మందిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరికొందరు కూడా మంటల్లో చిక్కుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో అపార్ట్‌మెంట్ ముందు పార్క్ చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలు కూడా దగ్ధమయ్యాయి. ప్రమాదంపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. అపార్ట్‌మెంట్‌లో ఉన్న 15 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఊపిరాడక కొంత మంది అపస్మారక స్థితికి చేరుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Nakka Anand Babu: ఇసుక టెండర్ల ద్వారా మరో పెద్ద కుంభకోణం..!
