NTV Telugu Site icon

Talasani: దేశంలో ఇలాంటి ఇల్లు చూపించండి.. రాజీనామా చేస్తా..!

Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav

Talasani: ఇటువంటి ఇల్లు దేశంలో ఎక్కడైనా కట్టినట్టు నిరూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్దిదారులకు మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఒక్క కేసీఆర్ కి తప్ప ఇంకెవరికి దేశ రాజకీయ చరిత్రలో ఇటువంటి డబుల్ బెడ్ రూములు కట్టిచ్చిన చరిత్ర లేదని అన్నారు. ఇటువంటి ఇల్లు దేశంలో ఎక్కడైనా కట్టినట్టు నిరూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. భట్టి విక్రమార్కకి నేను GHMCలో కట్టిన ఇళ్ల గోడలు చూపిస్తే ఇల్లెక్కడ ఉన్నాయి అని వెటకారం చేశాడని మండిపడ్డారు. గాలి మీద ఎన్ని అయినా మాట్లాడవచ్చు…నిలబడి కట్టినోడికి తెలుసు బాధ అన్నారు. BRS ప్రభుత్వంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనేది సీఎం ఆలోచన అన్నారు. పారదర్శకంగా డబుల్ బెడ్ రూంల ఎంపిక ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. సెక్రటేరియట్ నిర్మిస్తే లంక బిందెలు ఉన్నాయని చెప్పి ఎన్నో ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు.

ఇవాళ దళిత బంధు రెండో విడత కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సంక్షేమ పథకాల అమలులో స్పీడ్ పెంచింది. కొత్త పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు ఇప్పటికే ఉన్న పథకాలను లబ్ధిదారులకు మరింత చేరువ చేయడమే హ్యాట్రిక్ సక్సెస్ లక్ష్యం. వెనుకబడిన దళితులకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించేందుకు దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారు. మొదటి దశలో ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం, రెండో విడత పంపిణీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 162 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. మొదటి విడత పంపిణీలో అవకతవకలు జరిగాయని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రెండో విడతలో భాగంగా అర్హుల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ఒక్కో నియోజకవర్గానికి 1100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణలోని 72 నియోజకవర్గాల్లో 50 వేల దరఖాస్తులను పరిశీలిస్తున్నారు.
Minister KTR: దళితబంధు అందాల్సిన వారు ఇంకా లక్షల్లో ఉన్నారు