Ponnam Prabhakar: విద్యార్థుల మీద రాజకీయం చేయవద్దని, విద్యార్థి నాయకుడిగా సమస్యలపై అవగాహన ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ సిద్దిపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. జ్యోతిబాపూలే గురుకులాన్ని జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. కిచెన్, ఆహార పదార్థాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. తెలంగాణ గురుకులాలు, హాస్టళ్లలో గతం కంటే మెరుగైన విధంగా వసతులు ఉన్నాయని తెలిపారు. గురుకులాలు, హాస్టళ్ళ పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్లు ,అడిషనల్ కలెక్టర్ లు శాఖల అధికారులతో కమిటీ వేస్తున్నామన్నారు. అధికారులు ప్రతి 15 రోజులకు ఒకసారి సందర్శించడం నివేదిక రూపొందించడం లాంటివి చేయాలని ఆదేశించారు. ఎక్కడ ఫుడ్ పాయిజన్ అవకాశమే లేకుండా అన్ని రకాలుగా శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం కాస్మొటిక్ & డైట్ చార్జీలు పెంచిందన్నారు. రాజకీయం చేసే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేయాలంటే చేయండి అంతేకానీ.. విద్యార్థుల మీద రాజకీయం చేయవద్దన్నారు. విద్యార్థి నాయకుడిగా నాకు సమస్యలపై అవగాహన ఉందని మంత్రి తెలిపారు.
CM Revanth Reddy: విద్యార్థులను కన్న బిడ్డల్లా చూడాలి.. జిల్లా కలెక్టర్లకు సీఎం సూచన..
Ponnam Prabhakar: విద్యార్థుల మీద రాజకీయం చేయవద్దు.. మంత్రి పొన్నం ఆగ్రహం..
- సిద్దిపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన..
- జ్యోతిబాపూలే గురుకులాన్ని జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి ఆకస్మిక తనిఖీ..
- విద్యార్థుల మీద రాజకీయం చేయవద్దు..
- విద్యార్థి నాయకుడిగా సమస్యలపై అవగాహన ఉంది..

Ponnam Prabhakar